నీటి బుడగల్లా కాక !;-- కోరాడ నరసింహా రావు !
ఈ పాంచభౌతిక రంగుల ప్రపం చంలో....
అన్నిహంగులూఉంటే 
నే ఈ మనిషికి గుర్తింపు -  గౌ ర 
వం..... !
       ఎలా సంపాదించావని... 
  ఎవరూ  అడగరు ... !
   ఎంతసంపాదించావో  అదే 
      చూస్తారు.... !!

బంగళాలు, కార్లు... విలాసవం తమైన జీవనం.... వీళ్ళే... 
ఈ సమాజంలో గొప్పవారు... !
  సమర్థులు... !!

ఇవేవీ లేని వారు అసమర్దులే  !
వీళ్లకో విలువా..., గౌరవమా !!
 వీళ్లది అసమర్దుల జీవయాత్ర!

ఎంతైనా సంపాదించొచ్చు.... 
  తప్పులేదు... !
అది,ధర్మబద్దంగా,న్యాయసమ్మ
తంగా ఐతే....., సంతోషమే.... 
అలాంటివారెన్నిరంగుల హంగు  లతోసుఖానంద సౌఖ్యాలనుభ విస్తూ...  జల్సాగా బ్రతికినా... సబబే !!  

అదే... అన్యాయార్జితమైతే.... !
  ఈ రోజు, కాకపోతే  రేపు.... 
రేపూకాకపోయినాఏదోఒకరోజు
 చట్టం చేతిలో చిక్కక తప్పదు !

అపుడీ రంగులహంగులపొంగు 
లన్నీ... గాలితీసేసిన బెలూన్లే !
 కటకటాలు లెక్కపెట్టుకుంటూ 
చిప్పకూడు తినవలసిందే... !!

న్యాయ సమ్మ తమూ... ధర్మబ 
ద్దమైన సంపాదనతో.... 
   పూరి గుడిసె లోనైనా... ఉన్న దానితో, తృప్తిగా జీవించే వారి 
జీవితాలలో..సంతోషపుహంగు లు ఆనందపు రంగులు... వెల్లి విరుస్తాయి.... !!
       ఈ రంగులు - హంగులు... 
కలకాలం నిలుస్తాయి !
  రంగుల హంగులతో... కాసేపు కనిపించే ... నీటిబుడగల్లా... 
  ఇవి అంతలోనే పేలిపోవు !!
    ********

కామెంట్‌లు