తల్లిదండ్రులపయి దయలేని పుత్రుండు
పుట్టనేమివాడు గిట్టనేమి
ఇంటబుట్టి పెరిగి ఇల్లాలి బంటురా
విశ్వదాభిరామ వినురవేమా
తాత్పర్యం: ఈ వేమా ! తల్లిదండ్రులపై ప్రేమ లేనివాడు జీవించి వున్నా, చనిపోయినా ఒక్కటే.ఇంటిలో పుట్టి పెరిగి, పెద్దవాడై అనంతరం భార్యకు దాసుడు అయినట్లుగా వుంటుంది. మనల్ని క్ని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులపై ప్రేమా, బాధ్యతలు వుండాల్సిన ఆవశ్యకతను వేమన ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు.
నేటి ఆధునిక యుగంలో విధికొక వృద్ధాశ్రమం వెలుస్తున్న నేపథ్యంలో ప్రతి కొడుకు లేక కూతురు విధిగా తెలుసుకొని, ఆచరించాల్సిన విషయం ఇది. నాటి యుగంలోనే తల్లిదండ్రులు వృద్దులయ్యాక తమ పిల్లల చేత అనాదరింపబడతారన్న విషయాన్ని వేమన గుర్తించి ఈ మానవాళిని హెచ్చరించాడు.
వారి రక్త మాంసాలను పంచుకు పుట్టి, వారి శక్తినంతా తాగేసి పెద్దవారలమైన మనం వారిని నిర్లక్ష్యం చేయడం, వారిని అవసాన దశలో అనాధలుగా వదిలివేసి మన స్వార్ధం చూసుకోవడం క్షమించరాని నేరం... మనం జీవించే ఈ ప్రపంచం సుఖంగా వర్ధిల్లాలంటే, వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత నెరిగి ప్రవర్తించడం ఎంతో అవసరం. ఈ లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు వుంటారేమోగాని, ప్రేమ లేని అమ్మ, బాధ్యత ఎరుగని నాన్న మాత్రం వుండరు. పరిస్థితుల వలన వారి ప్రవర్తన మనకు మంచిగా అనిపించవచ్చు. అమ్మ ప్రేమ కళ్ళలో చూడగలం గాని నాన్న ప్రేమను మాత్రం కన్నీళ్ళతోనే తెలుసుకోగలం తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా ఆరాధించమని చెప్పే గొప్ప సంస్కృతి, సంప్రదాయం విలసిల్లుతున్న పుణ్య భూమి లో వీధికో వృధాశ్రమం వెలవడం ఎంత దౌర్భాగ్యం ?
నేటి యువతే రేపటి వృద్ధులు అన్నది నిర్వివాదాంశం.ఆస్తులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కాని మనుష్యులు పోతే మాత్రం తిరిగి రారు.అందుకే వారిని నిర్లక్ష్యం గా వదిలివేయడం మహా పాపం.. వారికి పంచ భక్ష్య పరమాన్నాలు,మృష్టాన్న భోజనం అవసరం లేదు. కావలసిందల్లా కాస్తంత ఓదార్పు,ఆపత్ సమయంలో ఆసరా , మీకు మేము ఎల్లవేళలా తోడు నీడగా ఉంటామని భరోసా మాత్రమే.. తల్లిదండ్రులు పోయాక వేద మంత్రాలతో వెండి పళ్ళెం లో పిండాలు పెట్టడం కంటే బ్రతికి వున్నప్పుడు కడుపు నిండా తిండి, ఆసరాకు తన భుజాన్ని,ఓదార్పుకు ఒక మాట ఇవ్వగలిగినవారే నిజమైన మనుష్యులు
సి హెచ్ ప్రతాప్
బాచిలర్స్ ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్స్( ఉస్మానియా)
ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
MOBILE no : 95508 51075

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి