ఎండా కాలం;- కొప్పరపు తాయారు
          వచ్చిందండీ వచ్చిందీ  ఎండాకాలం
          వచ్చిందీ ఎండలు బాగా తెచ్చింది
          పిల్లలందరికీ పండగే నండి
          మామిడి పళ్ళ కాలం మనసైనదీ !!

          పెద్దలు పిన్నలు ఆస్వాదిస్తారు తియ్య
         తియ్యని మామిడి పండ్లు,తాటిముంజలు 
         ఈతపళ్ళు , చలి వేంద్రాలు వెలసేను 
         తాపము తీర్చగ, తడవ ,తడవకూ

        తియ్యటి పానీయాలు,మజ్జిగలు, లస్సీలు
        మధురాలండీ, మమతల‌  వెల్లువలు
        ఆటల పాటల ఆలవాలము ఆనందాల
        హరివిల్లు, ఆవకాయ హంగామా అందరికీ!!

       బలే మంచి కాలం బంధువులందరూ
       కలిసే కాలం  సంతోషాలకి  నిలయం
       కానీ ఎండను కాచి నీడన నిలిచి
       కాపాడు కోవాలి ఆరోగ్యం!!!

       ఆరోగ్యమే మహాభాగ్యము అది
       తెలుసు అందరికీ అందుకే కాపాడకోవాలి
        ప్రతి ఒక్కరూ తమని తామే, జాగ్రత్త
        భయం నాస్తి , ధైర్యం తో అడుగేయండీ !!!

కామెంట్‌లు