వారాల ఆనంద్ కు కీర్తిపురస్కారం

 పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చే ప్రతిష్టాత్మక కీర్తిపురస్కారం నేడు హైదరాబాద్ లో జరిగిన సభలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ఆచార్య తంగేడు కిషన్ రావు కరీంనగర్ కు చెందిన కవి అనువాదకులు వారాల ఆనంద్ కు అందజేసారు. ఇటీవలే జాతీయ స్థాయిలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్న ఆనంద్ అనువాద పుస్తకం   'ఆకుపచ్చకవితలు' భూమికగా ఈ అవార్డును అంద జేసినట్టు కిషన్ రావు అన్నారు. యూనివర్సిటీ సభామందిరంలో జరిగిన సభలో రిజిస్ట్రార్ భట్టు రమేష్, రాష్ట్ర గ్రంథాలయ సంస్ధ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు
**
కామెంట్‌లు