ఉగాది;- - మేఘన శివాని గోగు హైదరాబాద్;- వెంకట్ : మొలక ప్రతి నిది
వేప పూత చెట్టుకు పూస్తేనే ఉగాదా?
మామిడి ఇగురు చిగురు కాస్తేనే ఉగాదా?
కోకిల కుహు కుహు రాగాలు తీస్తేనే ఉగాదా?
మల్లెలు మత్తుగా పరిమళిస్తేనే ఉగాదా?
ఇంటింటా తోరణాలు కడితేనే ఉగాదా?
ఇల్లాలికి కొత్త చీర కొంటేనే ఉగాదా?
షడ్రుచుల పచ్చడి ఉంటేనే ఉగాదా?
పంచాంగ శ్రవణం వింటేనే ఉగాదా?
........
ఆకలి హృదయాలకు నూతన ఉదయాలను తెస్తే ఉగాది
నిరుద్యోగులకు చిరుద్యోగాలైనా కల్పిస్తే ఉగాది
ముప్పొద్దుల ప్రతీ ఒక్కరు భుజిస్తే ఉగాది
కుల-మత బేధాలు అంతరిస్తే ఉగాది
నోట్లతో ఓట్లను కొనకుంటే ఉగాది
కోట్లెన్ని ఉన్నా, విలువలు విడువకుంటే ఉగాది
ప్రతీ బిడ్డ బడి ఒడిలో అడిగిడితే ఉగాది
చదువు "కొనకుండా" చదువు"కుంటేనే" ఉగాది
ప్రతీ మనిషి స్వేచ్ఛగా జీవిస్తే ఉగాది
మనిషిని మనిషిగా గౌరవిస్తేనే ఉగాది!



కామెంట్‌లు