పరీక్షలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మార్చి నెల చకచకా పరుగులు పెడుతోంది. పిల్లల పెద్దల గుండెల్లో రైళ్ళు. అసలే పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు టి.వి.పేపర్లలో చూసి ఖంగారు బేజార్ తో సతమతం అవుతున్నారు టీచర్లతో సహా! మంచి రిజల్ట్ రాకపోతే ఉద్యోగం ఊడుతుంది అని వారి బాధ!
ఆరోజు కౌన్సిలింగ్ చేయడం కోసం శివా వచ్చాడు. "పిల్లలూ!ఏడాది పొడుగుతా మీరు చదువుతూనే ఉన్నారు. రోజూ పేపర్ ఎంతమంది చదువుతారు?" "నేను రోజూ చదువుతాను సార్!" హరి అన్నాడు. "గుడ్!నిన్ను బాగా ఆకర్షించిన అంశంఏది?" " సార్! పుట్టుకతోనే కుడిచేయి లేని పాతికేళ్ల  గణేష్ కుస్తీ పోటీల్లో రాణిస్తున్నాడు.వంద కుస్తీ పోటీల్లో 70గెలిచాడు. అలాంటి దివ్యాంగులు మనందరికీ ఆదర్శంకావాలి.మనకి మనమే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోవాలి.ఒకతలుపు మూసుకొని పోతే వేరే తెరచిన తలుపులు వెతకాలి.రోజూ ఓక్రమపద్ధతిలో చదవాలి. నెలపరీక్షలు రాస్తుంటారు మీరు. అలాగే పబ్లిక్ పరీక్షలు!మార్కులు తక్కువ వస్తే సిగ్గు పడాల్సిన పనిలేదు. ధైర్యం  మనపై మనకు నమ్మకం ఉండాలి. పెద్దలు కూడా ఓభూతం దెయ్యం లాభయపెట్టి టార్చర్ పెట్టకూడదు." అంతే పిల్లలతోపాటు టీచర్లుకూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు🌹
కామెంట్‌లు