అహం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఓసాధువు రాజుగారి దగ్గరకు వెళ్లి ఆశీస్సులు అందజేశాడు.రాజు చాలా ఆనందంతో "స్వామీ!మీకు ఏదికావాలన్నా నేను సమర్పించటానికి సిద్ధంగా ఉన్నాను."అని అంటాడు. సాధువు నవ్వుతూ"నీకు చాలా ఇష్టమైనది ఇవ్వు" అని అంటాడు. "సరే! నారాజ్యాన్ని సమర్పిస్తాను స్వామి!" "రాజా! రాజ్యం భూమి మనవికాదు.ప్రజలకి తండ్రిలాగా  సంరక్షకుడివి మాత్రమే!" "ఐతే  ఈరాజప్రాసాదం నేను కట్టించినదే! నావస్తు వాహనాలు అర్పిస్తాను." " నాయనా! నీవు సురక్షితం గా ఉంటేనే కదా జనాలని కాపాడగలవు.కాబట్టి ఇవిగూడా ప్రజలసొత్తు"."సరే స్వామి! ఈశరీరం నాదికదా? దీన్ని స్వీకరించండి "."రాజా! శరీరం నీటిబుడగ.వానరాకడ ప్రాణం పోకడ తెలీదు. నేనేం చేసుకోను? నీకు పిల్లలున్నారు.వారికి నీబాధ్యత ఉంది. " రాజుకిఏం చేయాలో తోచలేదు. విచారంగా "స్వామీ!మీరే సెలవీయండి" అని అర్ధించాడు.సాధువు నవ్వుతూ అన్నాడు " నీ అహంకారం ని ఇచ్చేయి నాయనా! అదే మనిషికి పెద్ద బంధం అడ్డంకి " అన్నాడు. ఇది మన అందరికీ వర్తిస్తుంది సుమా🌹
కామెంట్‌లు