నీ. రసం ;- కొప్పరపు తాయారు
నీలోని రసంఅంటేఆలోచన
అదే  అసలైన నీరసం
నిజమైన నీరసం పాపం
ఆరోగ్యహీనులకు !!!

పనిదొంగలకు పడరాని
నీరసం వ్యక్తం చేయ వేయి
విధములు!

బాధపడ లేక ఏడ్వలేక     
  కండ్ల నీరు ఇంకిపోయి         
తనకు తానే బరువయినపుడు
మహానీరసం!!!

 నిన్ను అనుభవించ నీయదు
 సుఖపడనీయదు, ఆంటి పెట్టుకుని 
అహర్నిశలు నిన్ను బాధపెట్టు నీరసం
కక్షసాధించు  కడవరకు కనికరం లేక !!!

తిన్నది అరాయించుకోలేక నీరసం,
అత్తపనిచెప్ప మూతి మూరెడు చేసి                        
మూలనున్న మంచమెక్కిన మగువ
కొంగ్రొత్త నీరసం!!

సర్వశక్తులుడిగి పోయి ఆధార           
భూయిష్టమై,తల్లిదండ్రులకు
దూరమై ఒంటరైన బ్రతుకు పడరాని,                      
విడలేని  నిరంతర నీరసం!

నీదు నీ రసం  నీదగ్గరుండ నీదు బుద్ధి బలం 
నీదు మదినుండ     సశేషం                              
బుద్ధి వినియోగించు జీవీతం పండించు!!!

కామెంట్‌లు