తడపాకల్ పాఠశాలలో ఉగాది బాల కవి సమ్మేళనం




 శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని జిల్లా ఉన్నత పాఠశాల తడపాకల్ లో బాల కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఉగాది పండుగ విశిష్టతను దాని వైభవాన్ని తెలియజేసే విషయాల గూర్చి సుమారు 30 మందికి పైగా విద్యార్థులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారనీ తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. ఆంగ్ల నూతన సంవత్సరానికి తెలుగు నూతన సంవత్సరానికి మధ్యగల భేదాన్ని చెప్పడమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు తెలియజేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను మరియు చక్కని పుస్తకాలను బహుమతులుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, నాగప్ప, శంకర్ కృష్ణ ప్రసాద్, విజయ,స్వప్న, సుజాత పాల్గొన్నారు
కామెంట్‌లు