కోరాడ బాలగేయం
కిరణ్ బొమ్మను గీశాడు 
 చక్కని రంగులు వేసాడు... 
   తన్వీర్ నీళ్లు ఒంపాడు 
      బొమ్మను పాడు చేసాడు 

కిరణ్, తమ్ముడ్ని కొట్టాడు 
  తన్వీర్ అన్నను తన్నాడు 
   ఇద్దరూ తన్నుకుంటుంటే 
   గబ - గబా అమ్మవచ్చింది 

ఇద్దరినీ విడ దీసింది... 
  చెరో దెబ్బా వేసింది 
   అన్నదమ్ములు మీరు 
  ఇలా ఎప్పుడూ కొట్టుకోవద్దు 
  ఎల్లకాలమూ మీరిద్దరూ 
  కలిసీ మెలిసే ఉండాలి !

   అన్నంటే  తమ్ముడికి 
  గౌరవముండాలి... 
    తమ్ముడంటే అన్నకెoతో 
    ప్రేమ ఉండాలి... !

 అన్నదమ్ములంటే... 
  వాలి - సుగ్రీవుల్లా కాదు 
  రామ,లక్ష్మణులవలె...
  ఎల్ల కాలమూ కలిసే ఉండాలి 

 ఒకరికి, ఒకరు మీరిద్దరూ 
  సారీ చెప్పండి... 
    మేమెప్పుడూ కొట్టుకోమని 
    మా ట    ఇవ్వoడి...!
 
  అమ్మచెప్పిన మాటను 
  ఇద్దరూ  బుద్దిగ విన్నారు  
  అమ్మ, ఇద్దరినీ చేరదీసి 
   ముద్దులు పెట్టింది... !!
      *****

కామెంట్‌లు