చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని హిందువులు నమ్ముతారు . మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది ఆచరణలోకి వచ్చిందని మరొక గాధ ప్రాచుర్యంలో వుంది. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. వసంత రుతువు కూడా అప్పుడు మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. శాలివాహనడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్తశ్యంలోకి వచ్చిందని మరొక గాథ.
ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షగ్రమనానికి ఆది ఉగాది అంటే సృస్టి ఆరంభమైనదినమే ఉగాది. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.“ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి ,పులుపు,ఉప్పు , కారం , చేదు , వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవొచ్చు. మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా అలోచించి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి