అమ్మా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నవమాసాలు కడుపులో మోసి
ననుకన్న నాతల్లికి నమస్కారాలు

జన్మనిచ్చి ప్రేమతోపెంచిన
జనయత్రికి పలికెదజేజేలు

పాలిచ్చి పోషించిన
పవిత్రమాతకు ప్రణామాలు

మమతామమకారాలు చూపిన
మాతృముర్తికి మొక్కెదపలుసార్లు

ఊయలలోవేసి వూపి పాటపాడి
నిద్రపుచ్చినజననికి చేసెదపాదపూజలు

గళమెత్తిపాటపాడి జాబిలినిచూపించి
గోరుముద్దలుపెట్టిన తల్లికికృతఙ్ఞతలు

ఉగ్గుపాలతోపాటు మాతృబాషనేర్పిన
అమ్మకుచెప్పెద అభివందనాలు

ప్రతిదినము కడుపునింపి 
ఆకలితీర్చిన అమ్మకునమస్సులు

పెక్కు పిండివంటలుచేసి
తినిపించిన తల్లికి దండాలు

కష్టాలు పడుతున్నప్పుడు కాపాడిన
కన్నతల్లికి ఘటించెద పుష్పాంజలులు

రోగాలపాలయినపుడు రోదించి
చికిత్సలందించిన మాతకు మ్రొక్కులు

ఏడుస్తున్నప్పుడు చంకనెత్తుకొని
కన్నీరుతుడిచిన తల్లికిజోహారులు

మాతృమూర్తులకు పలునమస్కారాలు
మగువలకు మహిళాదినోత్సవశుభాకాంక్షలు

++++++++++++++++++++++++++++++++++++

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళామూర్తులందరికి- అమ్మలకు, అమ్మమ్మలకు, భార్యలకు, కూతుర్లకు, కోడళ్ళకు, మనుమరాళ్ళకు అందరికీ శుభాకాంక్షలు. ఆడవారు అందరూ అమ్మలో కాబోయే అమ్మలో కావున, మాతను మహిళలకు ఆదర్శవంతురాలుగా తీసుకొని కవితనుకూర్చాను. పాఠకులు ఇది గమనించవలసినదిగా కోరుతున్నాను.

కామెంట్‌లు