ఆశయే... బీజము... పేరాశ,
దురాశలకు...చివరికివియే...
నిరాశకుగురిచేసి.. దుఃఖమును
.మిగుల్చును.... !
చనువు పెరిగిన... హద్దులను మీరుదుము... !
అనర్ధములకదియే దారితీయు నుసుమీ...!!
నిశీధిలోనే... నేరములు జరుగును,
చీకటిపనులేవి చేయబోకు !
వయసువేడిని బుజ్జగించి జో కొట్టవలసినదే...,సభ్యసమాజ మొకటున్నది,గమనించవయ్యా
సమాజమున సభ్యతకు చేటు
రానీయక సుఖముల ననుభ వించుటయే సంస్కారముకదా!
కట్టుబాట్లనుగౌరవించి,ధర్మ బద్ద ముగ కోరికలు దీర్చుకొనవయ్య
పూలరేకుల పాన్పున పరవశించే నీవు ప్రేయసి ఎద
సవ్వడితో జతకట్టగలవు
మనసుకధ లవిఎన్నో....
వినబోకు నీవు....
ఎండమావులవెంట పరుగు తీయుదువు ... !
సద్ బుద్ది చెప్పిన మాట...
వినిపించుకోవయ్య... !
సజ్జనుడవై సత్కీర్తి...
పొందగలిగెదవు.. !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి