మావూరి దేవుడు
మహమంచి దేవుడు
మావేణు దైవము
మాకెంతో ప్రియము
వేణుస్వామిని నోరారా
వేడుకుంటా
ఊరివారి నొకతాటిపై
నిలుపమంటా
ఉత్సవాలను ఘనంగా
జరిపెదమంటా
ఊరిజనులను సమంగా
ఉద్ధరించమంటా
పాడిపంటలను బాగుగా
పండించమంటా
పల్లెనంతను సరిగా
పెంపొందించమంటా
ఒకకంట రైతులను
కాంచమంటా
ఒడుదుడుకులులేక
కాపాడమంటా
ఆరోగ్యమును అందరికీ
ఇవ్వమంటా
ఆదాయమును సర్వులకూ
కూర్చమంటా
స్వామిసేవను చేయంగా
శక్తినివ్వమంటా
సమస్యలేమియు లేకుండా
చూడమంటా
రుక్మిణీదేవినీ
శ్రీదేవిగా కొలుస్తాం
సత్యభామనీ
భూదేవిగా పూజిస్తాం
కళ్యాణమును
కమనీయంగా చేస్తాం
ఖర్చులకు
కొరతలేకుండా చూస్తాం
పెద్దలను ప్రీతితో
చూడవయ్యా
పిన్నలను ప్రేమగా
చూడుమయ్యా
సౌభాగ్యవతులకు
శుభములివ్వమయ్యా
సుకన్యలకు చక్కని
సంబంధాలనివ్వమయ్యా
వేణుస్వామిని నోరారా
వేడుకుంటా
ఊరివారి నొకతాటిపై
నిలుపమంటా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి