కొత్తగ వినిపించే కోకిల
పిలుపులతో కోనలో సందళ్ళు
అవనిపై రసమయమగు
నవ్య రాగాలాపనలు
మరుమల్లెల గుత్తులతో
మారుతపు మంతనాలు
మనసును మురిపించే
మధుర సంకేతాలు
అందినదేమో అనిపించే
ఆనందపు అందలము
అనుభవమైతే కానీ
అర్థమవని అనుభూతులు
ఉద్యానములో వికసించిన
గులాబీల రంగులన్ని సంగ్రహించి సమ్మోహనంగా అలదుకున్న
అంబరపు ఆడంబరం
మునుపెన్నడు లేనికళలన్నీ మొగమున చిమ్మిన
నవ వధువులా కళకళ లాడుతూ
కనువిందు చేస్తున్న పుడమి...
అణువణువూ ఆవరించిన
అపురూపమైన అమృతభావం
కనిపించక వినిపించే
వసంత ఆహ్వానరాగం
ప్రతి చిగురాకుపై మెరుస్తూ
ఆమని వెలుగుల సంతకం
ప్రతి ముంగిలీ మంగళమయం చేస్తూ
ప్రభవించే అఖండ కాంతికలశం
ప్రతి ఋతువూ వసంతమై
ప్రతి ఉదయం శుభోదయమై
ప్రతి మనసూ మందిరమై
ప్రతి క్షణమూ అపురూపమై
ప్రతి రోజూ పండుగలా
సాగాలని ...
శోభకృతు
శుభాకాంక్షలతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి