శ్రీరామ నవమి పండుగ
మోదమే మదిని మెండుగ
సీతారాముల వివాహం
భక్తిని నింపే నిండుగ
అయోధ్య రామయ్య నవమి
నాడు దశరథుని గృహమున
కన్నుల పండుగగ పుట్టెను
తండ్రి మాట నెరవేర్చెను
జన్మ,పెళ్లి కలసొచ్చిన
అపురూపమైన మంచి రోజు
తండ్రి మాట కొరకు కొడుకు
అడవికి వెళ్లొచ్చిన రోజు
ఏకపత్నీ పురుషుడుగా
రాముడు ప్రసిద్ధి గాంచెను
నేటి తరపు కొంటె కొడుకులకు
ఆదర్శంగా నిలిచెను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి