న్యాయాలు -86
తప్త తైలాంబు న్యాయము
******
తప్త అనగా వేడిచేయబడిన కాచబడిన అని అర్థం.తైలము అనగా నూనె.అంబు అనగా నీరు.
కాగుతున్న నూనెలో నీళ్ళు పడితే భగ్గుమని మండుతుంది. దీనినే మనుషులకు వర్తింప చేస్తూ చెప్పారు మన పెద్దలు.కోపంతో ఊగిపోయే వ్యక్తులకు, దుష్ట గుణాలున్న వారికి, హిత వచనాలు చెవికి ఎక్కవనీ, మంచి మాటలు చెప్పే వారిపై భగ్గుమని మండిపడుతూ, చెప్పే వారికే చెడు చేయాలని చూస్తుంటారనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
కాబట్టి కోపంతో బుసకొట్టే వారిని,దుష్టత్వం ఉన్న వారిని పొరపాటున కూడా కదిలించ వద్దు. అలాంటి వారిని కదిలిస్తే ఏమౌతుందో మారద వెంకయ్య గారి భాస్కర శతక పద్యాన్ని చూద్దాం.
తడవగ రాదు దుష్ట గుణుదత్త మెరుంగ యెవ్వరైన నా/చెడు గుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోప చిత్తుడై/గడుదెగ జూచుగా మరుగ గాగిన తైలము నీటి బొట్టు పై/బడునెడ నాక్షణం బెగసి భగ్గు మండక యున్నె భాస్కరా!!'
అనగా దుష్టుల మనసు దుష్టత్వంతో నిండి ఉంటుంది కాబట్టి వారికి దూరంగా ఉండటమే మంచిది.వాళ్ళు దుర్జనులు అని తెలిసిన తర్వాత ఇక నీతులు చెప్పే సాహసం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.ఎందుకంటే అలాంటి వారికి ఎలాంటి హిత వాక్యాలు చెవికెక్కవు. పైగా చెప్పిన వారికి చెడు చేయాలని చూస్తారు కూడా.
అదెలాగంటే బాగా కాగిన నూనె నీటి బిందువును ఎలాగైతే దహించి వేస్తుందో ఆ విధంగా అన్న మాట.
మన చుట్టూ ఉన్న సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే ఈ న్యాయము అక్షర సత్యం అనిపించక మానదు.
ఆవేశంతో నోటికి వచ్చినట్లు తిట్టుకునే మూర్ఖుల మధ్యలో గానీ, కత్తులు దూసి దాడి చేసుకునే దుర్మార్గుల మధ్యలోకి గానీ వెళ్ళి సామరస్యం కుదర్చబోతే...అలా వెళ్ళిన వాళ్ళు వారితో పిచ్చి మాటలు పడటం, ఒకోసారి గాయాల పాలవ్వడం కూడా చూస్తూ ఉంటాం..
అలాంటి వారిని నిశితంగా గమనించే పెద్ద వాళ్ళు ఇదిగో ఈ తప్త తైలాంబు న్యాయమును ఉదాహరణగా చెప్పారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి