తెలుసుకుందాం ; - సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 









బెంగాల్ లో మాత్రమే జరుపుకునే అమ్మ వారిపూజ శీతలాదేవి కి  సంబంధించింది. ఈమె స్ఫోటక దేవత.మనం ఎల్లమ్మ తల్లి అంటాం.ఈమె వాహనం గాడిద.ఈదేవికి వేపచెట్టు ప్రీతికరం.స్ఫోటకం రకరకాల రోగాలు పిల్లల కి వచ్చే వి.మనం మీజిల్స్ చికెన్ పాక్స్ అంటాం.అవి వేసవిలోనే సోకుతాయి.అందుకే వేపమండలు గదివాకిలికి కడ్తారు.పిల్లలకి వేపమండలతో విసనకర్ర లాగా విసురు తారు. కొన్ని చోట్ల గాడిద పాలు తాగిస్తారుట!మల్లె జాజి పూలు నీటిలో కలిపి కాచి స్నానం చేస్తే బడలిక పోవటమేగాక చర్మరోగాలు ఎలర్జీ రాదు.ఇప్పుడు రసాయనాలతో తయారయ్యే కాస్మెటిక్ వాడకం పెరిగింది.వట్టివేళ్ళు నీటిలో నానేసి స్నానం చేయాలి.ఆయుర్వేదాన్ని ప్రకృతి వైద్యం ని మనం పాటిస్తే మంచిది
++++++++++++++++++++++
చైత్ర శుద్ధ తృతీయ నుంచి వైశాఖ శుద్ధ తృతీయ వరకు గౌరీదేవి ని పూజిస్తారు.ఇదిగౌరీ తృతీయ గా పిలువబడుతుంది
+++++++++++++++++++++
నార్త్ ఇండియా లో చైత్రమాసంలో 6వరోజు అశోకషష్ఠి  అనే వేడుక జరుపుకుంటారు.అశోక చెట్టు నుంచి పూజించి దాని 6పూలమొగ్గలను నీటిలో కలిపి తాగుతారు ట!రాజుని పెళ్లాడి న ఓయువతికి తాను పెంచి పెద్ద చేసిన మమకారం తో కొన్ని అశోకగింజలు ఇచ్చి దారి వెంట చల్లమనిచెప్తాడు.ఆమె సంతానం బతికి బట్ట కట్టకపోటంతో పెంచిన ముని దగ్గరకు వస్తుంది.ఆమె విసిరిన గింజలు అశోకవృక్షాలుగా ఎదిగాయి.ఆయన ఇచ్చిన మంత్రోదకంతో తన సంతానాన్ని తిరిగి పొందింది.అందుకే సంతానం ఆయురారోగ్యాలు కోరుతూ నార్త్ లో అశోకషష్ఠి జరుపుతారు.ఆయుర్వేదంలో బహుశా అశోకచెట్టు ఓషధీగుణాలు చెప్పబడి ఉండవచ్చు...
++++++++++++++++++++++++++++++++++++++++++++

కామెంట్‌లు