సుప్రభాత కవిత ; - బృంద

అంతరంగమున అలల సందడి
తీరానికి కెరటాల ఓదార్పు

మరపురాని మమతల
భారమైన మనసు

కాలమెంత కఠినమో
కారుణ్యమే  కానరాదు

లేవు ఏ తేడాలు
అందరినొకేతీరు

చీకటి వెలుగుల జీవన చక్రం
తిరుగుచూ  తిప్పునందరినీ

మనసులోని   మౌనమంత
మాటగా మారుటెపుడో!

రేగుతున్న గాయానికి
మరపుతోటే మందుపూత

భీతిల్లిన మనసుకెపుడూ
రేపు చూపు వెలుగుబాట

కలతల తలుపులు మూసేసే
కనువిందైన ఉదయానికి

🌸🌸  సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు