ఆర్టిఫిషియల్ థాట్స్!!?-- ప్రతాప్ కౌటిళ్యా
 ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో ఆర్టిఫిషియల్ బ్రెయిన్ లో ఆర్టిఫిషియల్ థాట్స్ సృష్టిస్తే, మన మెదడులో నాణ్యమైన ఆలోచనలు మాత్రమే సృష్టించే అవకాశం ఉంటుంది. మరొక అద్భుత అవకాశం ఏమిటంటే అందరివీ ఒకే ఆలోచనలు అవుతాయి. అంటే ఆలోచనలన్నీ ఒకేలాగా ఒకేసారి అందరిలో సృష్టించే అవకాశం ఏర్పడుతుంది. ఎవరో ఒకరికి మాత్రమే అద్భుత ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు ఆ ప్రత్యేకత వారికి మాత్రమే ఉంటుంది. ఆ ప్రత్యేకతను మనం తెజించి అందరికీ అన్ని ఆలోచనలు నాణ్యమైనవి అద్భుతమైనవి సృష్టించే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ థాట్స్ కు పునాదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని ఏర్పడ్డాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరో ముందడిగే ఆర్టిఫిషియల్ థాట్స్.
ఆర్టిఫిషియల్ థాట్స్ ప్రత్యేకత ఏమిటంటే మనం బ్రెయిన్ ను మొత్తాన్ని ఎట్లా వినియోగించుకోలేమో, అలాగే బ్రెయిన్ లోని కొన్ని విభాగాలను ఎలా వినియోగించుకొని మరికొన్ని విభాగాలను వృధాగా ఎలా వదిలేస్తామో అలాంటి పరిస్థితులు రాకుండా అన్ని విభాగాలను సమర్థవంతంగా వాడుకునేందుకు ఈ ఆర్టిఫిషియల్ థాట్స్ ఉపయోగపడతాయి. వృధాగా వదిలేసిన బ్రెయిన్ విభాగాలను పూర్తిగా వినియోగించుకుని సమర్థవంతంగా పనిచేసేందుకు అందరికీ అన్ని విభాగాలు పనిచేసేలా చేసేందుకు లేదా ఎవరికి ఏ విభాగాలు కావాలో ఆ విభాగాలు వినియోగించుకునేందుకు ఈ ఆర్టిఫిషియల్ థాట్స్ ఉపయోగపడతాయి. ఇందులో చాలావరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పనిచేస్తూ పోతూ ఉంటుంది దాన్ని కొంత మార్చి ఆర్టిఫిషియల్ థాట్స్ ను సృష్టించే విభాగాలను సృష్టించాల్సి ఉంది
ఆర్టిఫిషియల్ థాట్స్ కనుక ఒకసారి సృష్టించి వదిలేస్తే వాటిని రికార్డు చేసుకుని మరికొన్ని విభాగాలను ఏర్పరుచుకోవచ్చు. ఆర్టిఫిషియల్ థాట్స్ అన్ని ముందుగానే ప్రోగ్రామింగ్ చేయాల్సిందే నీకునని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చెప్తుంది. ప్రోగ్రామింగ్ లేకుండానే ఆలోచనలను నియంత్రించి సృష్టించే విభాగాల సమాచారం ఉంటే చాలు. అవే ఆ సమాచారంతో కొత్త ఆలోచనలను  సృష్టిస్తాయి అంటుంది ఆర్టిఫిషియల్ థాట్స్ విభాగం. బ్రెయిన్ లోని అన్ని విభాగాల సమాచార సమాహార సమన్వయము సహకారమే ఆలోచన అట్లే ఆర్టిఫిషియల్ థాట్స్ కూడా అన్ని విభాగాల సమాచార సహకార సమన్వయము తోనే ఆలోచనలు సృష్టించబడతాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కన్నా సులువైనదే కావచ్చు.
ఆలోచనలు చేసే పని అనుభవంతోనే పుట్టుకొస్తాయి. చాలావరకు ఫాంటసీ ఇమేజినేషన్ తోనే ఆలోచనలు చోటు చేసుకుంటాయి. అంటే ఆలోచనలన్నీ కూడా కేవలం ఫాంటసీ ఇమేజినేషన్ తోనే ఏర్పడతాయి. కనుక పని అనుభవము ఆలోచనలకు సెకండరీ మాత్రమే. అంటే ఫాంటసీ ఇమేజినేషన్ సృష్టించే పరికరం కావాలి. అది బ్రెయిన్ ఒక్కటే. ముఖ్యంగా బ్రెయిన్ నడిపించే కెమికల్స్ మాత్రమే ఆ పని చేస్తున్నాయి.
ఆ స్థానంలో పవర్ను వినియోగించుకోవచ్చునేమో కానీ ప్రోగ్రామింగ్ తప్పనిసరి. ఎట్లాగైతే ప్రకృతి జీన్ ను ప్రోగ్రామింగ్ చేసిందో, సరిగ్గా అట్లాగే మనం బ్రెయిన్ ప్రోగ్రామింగ్ చేయాల్సిందేనా. లేదా సహజంగానే ఉన్నది ఉన్నట్లుగా ప్రోగ్రామింగ్ చేసి చూస్తే సరి. అది సహకరిస్తే ఆలోచనలను ఆర్టిఫిషియల్ గా సృష్టించవచ్చు.
బ్రెయిన్ లో రసాయనాలతో ఏర్పడిన విద్యుత్ శక్తితో మాత్రమే ఆలోచనలు సృష్టించబడుతున్నాయి, పనిచేస్తున్నాయి. ఇప్పుడు రసాయనాలతో ఏర్పడిన విద్యుత్ శక్తిని మనం సాధారణ విద్యుత్ శక్తి సహకారంతో బ్రెయిన్ నడిపించి ఆలోచనలను సృష్టించవచ్చునేమో ఒకసారి ఆలోచిద్దాం. అది నిజమైతే రసాయనాలతో ఏర్పడిన విద్యుత్ శక్తి కి బదులుగా భౌతిక విద్యుత్ శక్తిని వినియోగించుకొని బ్రెయిన్ లో ఆలోచనలను సృష్టించవచ్చునేమో. వాటిని ఆర్టిఫిషియల్ థాట్స్ అని అనవచ్చునేమో చూద్దాం.
This article dedicated to prof Rajendra Singh, joint director, higher education Telangana state government.thank you sir.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు