శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 గుణ్ అంటే గుణాలు అనుకుంటాం.కానీ సంస్కృతంలో మౌలిక అర్థం తాడు అని! సద్గుణాలు దుర్గుణాలు అంటాం. రెండు  అంతకన్నా ఎక్కువ పోగుల దారం తాడు అని అర్ధం. అధర్వవేదంలో ఇలా ఉంది "పుండరీకం నవద్వారంత్రిభిర్గుణేభిరావృతం"9ద్వారాల కమలరూప శరీరం అని అర్ధం. సత్వ రజతమోగుణాలు మూడు.తాడు ధనుస్సు యొక్క అల్లెతాడు అనికూడా అర్ధాలున్నాయి.
గోష్ఠి అంటేఆధ్యాత్మ విషయాలపై జరిగే  చర్చ జరిగేచోటు అని చెప్పవచ్చు. విద్య కవిత్వం  సాహిత్య మీమాంస చర్చలు కవి పండిత గోష్ఠి మనం వాడుతున్నాం.మరాఠీలో గోష్ఠి అంటే మామూలుగా మాట్లాడుకోవటం అని అర్ధం 🌷

కామెంట్‌లు