రెడ్డి రాజులు (10);- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రావణాసురుడు తన రాజ్యాన్ని ఎంత సుభిక్షంగా ఉండేలాగా పరిపాలన చేశాడు కనుకనే పరిపాలనాదక్షుడు అన్నాడు. లంక మొత్తాన్ని ఒక ఇంటిలా చూసుకున్నట్లయితే  ఈ రోజుల్లో  ఇంటిముందు బుర్కాలు ఎలా కాపు కాస్తారో  ఆ రోజున ఇతరులు ఎవరూ లోపలికి రాకుండా  లంకిని అన్న రాక్షసిని కాపలాగా పెట్టాడు.  లంకలో ప్రవేశించడానికి ఎవరూ ప్రయత్నం చేసిన వారిని అమాంతం  తాను మింగేస్తుంది  ఆంజనేయ స్వామి కూడా అక్కడ వరకు వచ్చిన తర్వాత  ఆమె బారి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం కనిపించలేదు దగ్గరకు వచ్చి  ఆంజనేయస్వామి ఆహారంగా తీసుకుంది.  వారి యుక్తితో  ఆమె గర్భం నుంచి బయటపడి  లంక ప్రవేశం చేశారు. రామాయణానికి కథానాయిక సీత దేవి  పూర్వజన్మలో వేదవతి  వేదమే తానయినది. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు  అతి చిన్న పాత్ర అందరి మనసులో నిలిచినది శబరి ఈమె రాముని భక్తురాలు సిద్ధయోగిని మతంగ మహర్షికి శిష్యురాలు  తన జీవితంలో ఒక్కసారైనా శ్రీరామచంద్రమూర్తిని కలవాలన్న  ఆశతో జీవిస్తున్న ఆశాజీవి అనుకోకుండా వారు శబరి ఆశ్రమానికి రావడం  ఆమె అధిత్యం ఇవ్వడం  పండ్లను తీసుకొని  దాని రుచిని తాను చూసి ఎంగిలి పండ్లు రామునికి ఇస్తే ఆయన ఎంతో ఇష్టంతో తినడం  భక్తుల ఎడల వారికి ఉన్న ఆదరణ అలాంటిది అని చెప్పడానికి  అలాగే శాంత శ్రీరామచంద్రులకు చెల్లెలు అని చాలా మంది చెబుతూ ఉంటారు  కానీ దశరథ మహారాజు యొక్క మిత్రుడైన రామపాదనకు కుమార్తె ఆమె  శ్రీరామచంద్రమూర్తి ఆమెను తమ సొంత చెల్లెలు చూశారు.
శ్రీరామచంద్రమూర్తికి పండ్లు అంటే ఇష్టం అని తెలిసి  శబరి ఆయనకు అల్పాహారంగా పండ్లను  పెట్టింది  రామ రావణ యుద్ధం జరగడానికి ముఖ్యకార్పురాలు  రావణుని చెల్లెలు సూర్పనఖ చాటల వంటి గోరులు కలిగిన స్త్రీ  శ్రీరామచంద్రమూర్తిని చూసి ఆయనను వలచి  లక్ష్మణమూర్తి చేత  చెవులు ముక్కు పెదవులు  కోయించుకొని అవమానపడడం దానితో  అన్నకు  సీతను దూరం చేయడం వల్ల  నేను వారిని వశపడుచుకుంటాను  ఆ సహాయము చేయమని అడిగింది. అంతకుముందు సూర్పనఖ భర్త  వేరే స్త్రీని బలవంతం చేయబోతే  రావణాసురుడు అతనిని చంపడం తరువాత ప్రాణం పోసే సందర్భంగా చెల్లికి మాట ఇవ్వడం  నీ సుఖాలను తీర్చుకోవడానికి ఏ అడ్డంకి ఉన్న నేను తీరుస్తాను అని ఇచ్చిన మాట కోసం  సీతమ్మను దూరం చేశారు.



కామెంట్‌లు