జననేత- వై.ఎస్.ఆర్ (17) ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ప్రపంచాన్ని జయించాలని తలచిన ,అలెగ్జాండర్ ను ది గ్రేట్ అంటాం. బాటల వెంట చెట్లను నాటించిన అశోకుడిని ది గ్రేట్ అన్నాం  పరిపాలనా దక్షుడైన మొగల్ చక్రవర్తి అక్బర్ ని గ్రేటెస్ట్ అంటాం.
మరి 2004లో, 2009లో జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నిన ఎన్నికల రణరంగంలో జయహో అంటూ  అఖండ విజయాన్ని సాధించిన సంచలనాత్మకంగా అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా రెండుసార్లు గద్దెనెక్కిన  సూపర్ పాలకుడు,  సూపర్ జవాన్ నాయకుడు హరిత ఆంధ్ర స్వాప్నికుడు  ఆదర్శ ముఖ్యమంత్రి ఎక్కడో కోటికొక్కడు  ఎప్పటికో అరుదుగా కనిపించే ఒకే ఒక్కడు  మన్మోహన్ గారి చేత  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి చేత  నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా అభివర్ణించబడిన ధీరుడు  ఢిల్లీలో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశానికి వచ్చిన  విపక్ష ముఖ్యమంత్రులతో సహా  కాంగ్రెస్ ముఖ్యమంత్రి అందరూ కలిసి మీ అభివృద్ధి కార్యక్రమాల విజయ రహస్యం ఏంటో చెప్పమని అడిగినప్పుడు  ఆదర్శ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వంశ విశ్వంభరుడు, రాయలసీమ చంద్రశేఖరుడు, జననాడీ పరిశీలకుడు ప్రజాప్రస్థాన వర్ధి కుడు జలయజ్ఞ భగీరథుడు బహు పథకాల భాస్కరుడు  గోదాన దాన కర్ణుడు ప్రజాభిమత పరిపాలకుడు  పీసీసీ జాతకం మార్చిన జ్యోతిష్కుడు. ఇంతగా ఘనత వహించిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఏమని పిలుస్తారు  ఏ బిరుదులు ఇచ్చి సత్కరిస్తారు ఆలోచించండి  సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలయే దేశాభివృద్ధికి గీటురాయి అన్న మహాత్మా గాంధీ మాటలను  నిరంతరం స్మరిస్తూ ఆచరణలో పెట్టడమే డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి ఘనతకు కారణం  ఆయన చాలా మంచి మనిషి  ఆయన ఆలోచనలకు ముందు చూపు కలిగి ఉంటాయి  ఆయన చేసే పనులన్నీ తెలివైన వై ఉంటాయి  ఆయన పథకాలన్నీ నిత్య నూతనంగా ఉంటాయి  ఆయన చెప్పే మాటలన్నీ సూటిగా ఉంటాయి. ఆయన నడక ఎప్పుడు నిటారుగా ఉంటుంది ఆయన ప్రవర్తన ఎల్లప్పుడూ  ఒకే రకంగా ఉంటుంది ఆయన అభిప్రాయ బేధాలను మర్యాదపూర్వకంగా  తెలియజేస్తారు. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు  ఇలా ఆయన ఘనతకు ఎన్నో కారణాలు ఉన్నాయి  భారతంలో పాండవుల గెలుపుకు ఎన్ని కారణాలు ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు గెలుపునకు అన్ని కారణాలు ఉన్నాయి  అందుకే ఆయనంటే ఇష్టపడే వారికి కన్నుల పంట  గిట్టని వారికి కడుపు మంట. గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రి ప్రజా క్షేమం కోసం ప్రజాప్రయోగం కోసం ప్రజల ఉద్దరణ కోసం పలు కార్యక్రమాలను  ప్రారంభించడం సహజం  అయితే కార్యక్రమం ప్రారంభం కంటే ఆ కార్య పథక రచనకు అధిక ప్రాధాన్య ఇచ్చి అమలు అయ్యేట్లుగా చూడాలి  లేకపోతే ప్రజాస్వామ్యంలో ఆ నాయకుడు అప్రతిష్ట పాలవుతారు  అధికారుల్లో ప్రజల్లో చులకన అవుతాడు అలా కాకుండా తాను రూపొందించిన పథకాలన్నింటినీ  అమలు చేస్తూ ప్రజలకు సత్ఫలితాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.

కామెంట్‌లు