వైయస్ రాజకీయ ప్రవేశం అలవోకగా జరిగినా ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు ఆయన రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది 1882 నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన 2004 వరకు ఆయన అనేక సమస్యలతో, వివాదాలతో ఏటికి ఎదురిదారు. 1978లో తొలిసారిగా పులివెందుల నుంచి పరిశీలిస్తే తొలి 5 ఏళ్లు మాత్రమే ఆయన కొంత స్థిమితంగా ఉండగలిగారు. ఎమ్మెల్యే అయిన రెండున్నర ఏళ్ల తర్వాత వైఎస్ కు టి. అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి మంత్రి పదవి లభించింది భవనం వెంకట్రాం కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు 1983లో జరిగిన సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయ్యాక వై ఎస్ కూడా కష్టాలు మొదలయ్యాయి ఇదే ఏడాది చివరిలో పిసిసి అధ్యక్షునిగా పీఠం ఎక్కిన వైఎస్ వయస్సు 34 ఏళ్ళే. ఆయనకు పార్టీలోని సీనియర్ల నుంచి చుక్క ఎదురయింది వై. ఎస్ సారథ్యంలో జరిగిన 1984 లోక్ సభ 85 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటిమి పాలైంది దాంతో ఆయన పిసిసి పీఠం నుంచి వైదొలగ వలసి వచ్చింది 1985లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వై.ఎస్ శాసనసభ పక్ష ఉపనేతగా ఉంటూ ప్రతిపక్ష రాజకీయాల లో రాటుతేలాడు 1989లో మర్రి చెన్నారెడ్డి తిరిగి పిసిసి పెట్టిన తర్వాత లోక్ సభ శాసనసభకు జరిగిన ఎన్నికలలో వైఎస్ ను లోకసభకు పోటీ చేయవలసిందిగా అధిష్టానం ఆదేశించింది చెన్నారెడ్డి స్వయంగా ఇలా చేయించారంటూ ప్రచారం జరిగింది. వైఎస్ కడప నుంచి పోటీ చేసి భారీ ఆధిక్యతతో గెలుపొందారు అయితే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు కానీ రాష్ట్రంలో గెలిచింది. దీంతో ఆయన అధికారిక పదవులకు దూరం కావలసి వచ్చింది. 1989 నుంచి 94 వరకు వైయస్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది చెన్నారెడ్డి వైయస్ వర్గాన్ని రాష్ట్రంలో నీరుగార్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత వైఎస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయిన నేదురు మల్లికి అనివార్యంగా దూరమయ్యారు.
ఆ సమయంలోనే రాజీవ్ గాంధీ హత్య జరిగింది ఇది వై ఎస్ కు వ్యక్తిగతంగా చాలా నష్టం 1991 లోక్ సభ మధ్యంతర ఎన్నికలప్పుడు కడప లోక్ సభ అభ్యర్థిగా మళ్లీ వై ఎస్ రంగులోకి దిగారు ఆ నియోజకవర్గంలో పూలంగి వెంకటసుబ్బయ్య అనే స్వతంత్ర అభ్యర్థిని
ప్రత్యర్థులు ఎవరో హత్య చేశారు సరిగ్గా ఎన్నికల పోలింగ్ ఒకరోజు ముందు వెలుగులోకి వచ్చిన కారణంగా ఎన్నిక రద్దయినట్టు ప్రకటించారు సకాలంలో ఎన్నిక జరిగి వైయస్ గెలిచి ఉంటే 1891 పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవి లభించి ఉండేది నేదురు మల్లి తర్వాత వైయస్సుకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది తనకు ముఖ్యమంత్రి కావాలని లేదని తొలుత చెప్పిన కోట్ల ఆ తర్వాతే ఏమైందో ఏమో తానే సీఎం పదవిని చేపట్టారు ఆ తర్వాత నేత్రములతో కోట్ల కలిసిపోయి వైఎస్ ఎదుగుదలను నిరోధించారు.
జననేత- వై.ఎస్.ఆర్ (26)- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492611322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి