1992లో తిరుపతిలో జరిగిన ఏఐసీసీ ప్లినరీ సమావేశంలో కూడా సిడబ్ల్యుసి సభ్యుడిగా వైఎస్ ఎన్నిక కాలేకపోవడానికి వీరి వ్యూహమే కారణం అయ్యింది. అప్పుడు వైఎస్ కోట్ల ఇద్దరు పోటీలో ఉన్నారు ఒక దశలో వైఎస్ కుటుంబం సున్నపురాయి ఘనుల లీజును రద్దుచేసి ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇలా వై ఎస్ సొంత పార్టీలోనే వేధింపులకు గురయ్యారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది 26 మంది ఎమ్మెల్యేలు ఉన్న తరుణంలో 1999 ఎన్నికలకు ముందు వైఎస్ పిసిసి సారథి అయ్యాడు అప్పటికైనా ఏ పదవులు చేపట్టక 14 ఏళ్ల పాటు పార్టీలో ఎదురు దెబ్బలు తింటూ వైఎస్ మొక్కవోని విశ్వాసంతో ముందుకు సాగారు. 1999 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయినా ఎమ్మెల్యేల సంఖ్య 92 కు పెరిగింది ఐదేళ్లపాటు సీఎల్పీ నేతగా అధికార పక్షం వేధింపులను లెక్కచేయకుండా ఆయన చేసిన పోరాటం 2004 ఎన్నికలకు ముందు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది వైయస్ కేవీపి పేర్లు రెండున్నా భౌతికంగా ఇద్దరు ఉన్నా వారిరువురి ఆత్మలు ఒకటే విద్యార్థి దశలో స్నేహితులుగా మారిన వీరు జీవన ప్రస్థానంలో కూడా కలిసిమెలిసి ఉన్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ ఒకరి అభ్యున్నతికి మరొకరు పాటుపడుతూ విడదీయలేని స్నేహబంధం చరిత్ర వీరిది. కెవిపి అప్పటి కృష్ణాజిల్లా అంపాపురం గ్రామవాసి వారికి దగ్గరలో ఉన్న మా గ్రామం(తేలప్రోలు) లో ఉన్నత పాఠశాలలో ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదివారు.
ఆ పాఠశాలలోనే మా అన్నయ్య ఉపాధ్యాయులుగా ఉండడం వల్ల మా కుటుంబానికి చాలా సన్నిహిత మిత్రులుగా ఉన్నారు వైయస్ జీవితంలో కేవీపీ లేని అధ్యా యం ఊహించడం కష్టం 60వ దశలో మొగ్గ తొడిగిన వారి స్నేహం 21వ శతాబ్దపు మలుపు తిరిగి పదేళ్లు కావస్తున్నా చెక్కుచెదరకుండా సాగుతోంది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృష్ణా జిల్లా అంపాపురానికి చెందిన కేవీపీ రామచంద్రరావు తొలిసారిగా కలుసుకున్నది పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో గుల్బర్గా వైద్య కళాశాలలో బీజాలు పడిన వాడి స్నేహం ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోనూ పరిఢవిల్లుతోంది.40 ఏళ్లుగా రాజకీయాల్లో అడుగడుగునా పరస్పరం ఎలాంటి సంగతులు వెన్నంటే సాగుతున్న ఈ మిత్రద్వయం ఒడిదుడుకులేంటి కలిసికట్టుగా అధిగమించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి