కవికోకిల (3);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 అవధాన శాస్త్రల వారు అది చూసి మెచ్చుకుని కవితా రచనకు ప్రోత్సహించారు  అవధానుల వారి మాటలు అతని ఆలోచనలో పదే పదే తిరుగుతూ ఉండేవట ఒక పండితుని యోగ్యతాపత్రానికి చేయి చాపగా అతను తిరస్కరించాడట ఆ అవమానంతో పంతం పెరిగి సంస్కృత భాషను  నేర్చుకోవాలని ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళగా అక్కడ కూడా అతనికి అవమానమే ఎదురయింది  ఇలా అనేక కష్టాలు పడుతున్న రామిరెడ్డి గారికి  దర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి  ఆదరణ తోడైంది. పాపిరెడ్డిపాలెం లోని దేవుళ్ళ బలరామరెడ్డి కుమార్తె శేషమ్మతో  1915 వ సంవత్సరంలో గూడూరులో రెడ్డి గారికి వివాహం జరిగింది  పది సంవత్సరాల తర్వాత వారికి ఒక కుమార్తె జన్మించింది  బిడ్డ పుట్టిన వెంటనే భార్య మరణించింది  తర్వాత కుమార్తె కొన్ని రోజులకే జ్వరంతో చనిపోయింది.
భార్య వియోగంతో బాధపడుతున్న రామిరెడ్డిని చూసి అతనికి మరో వివాహం చేశారు. ఇతని రెండవ భార్య పేరు అన్నపూర్ణమ్మ వీరికి వేణుగోపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి అనే ఇద్దరు కొడుకులు జన్మించారు  రామిరెడ్డి అనేక రచనలు చేశారు వీరు 1915 వ సంవత్సరం చివరలో అతనికి  కవిత్వం చిగురించిందని 1916 మొదలు 1917 వరకు నా కవితాభ్యాస కాలం ఒక సంవత్సరం లోపల చదివి రాయడానికి చాలా తీవ్రంగా కొనసాగిందని చెప్పుకొచ్చారు.  ఆ సమయంలోనే రసికానందము స్వప్న శేషము అహల్యా సంగ్రహము  శ్రీకృష్ణుని రాయబారము అను ప్రబంధాలను నలజారమ్మ యువకాస్త్రము, కడపటి వీడ్కోలు,  వనకుమారి, కృషీవలుడు, జలదాంగన, కవి-రవి, పానశాల, పుష్ప బాణా విలాసము, రసిక  జానంగము, రుతు సంహారము. ఖండకావ్యములు నైవేద్యము జాతీయత నాటకములు కర్షక విలాసము సీత వనవాసము.
రామిరెడ్డి గారి గురించి ఆలోచించినప్పుడు పానశాల ఫలితకేశం పేర్లు మన మస్తిష్కంలో తళుక్కున మెరుస్తాయి. రోజూ అద్దం ముందు కూర్చుని గడ్డం గీసుకుంటున్నప్పుడు ఎప్పుడో ఒకసారి నలుపు రంగు పోయి తెలుపు రంగు సాక్షాత్కరిస్తుంది. వెంటనే తళుక్కున మెరిసెనొక పలిత కేశము అంటాడు ఆయన. పలిత కేశమంటే తెల్లని వెంట్రుక నలుపు చీకటికి అజ్ఞానానికి గుర్తు తెలుపు స్వచ్ఛతకు వెలుగుకు చిహ్నం తమసోమా జ్యోతిర్గమయా అన్న ఉపనిషత్ వాక్యాన్ని చెప్పడం కోసం ఖండకావ్యం  సూర్యకిరణాలలో మనకు స్పష్టంగా తెలుపు కనిపిస్తుంది. దానిని పట్టకం ద్వారా విశ్లేషిస్తే సప్త వర్ణాలు కనిపిస్తాయి  మన కామక్రోధ లోభ మాత్సర్యాలనే దానిలో నిబిడీకృతమై ఉంటాయి దాన్ని దాటి వెళ్లి నిర్మలంగా బ్రతకమని ఆయన సందేశం.




కామెంట్‌లు