రెడ్డి రాజులు (4);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నిత్యావసరములైన ఉప్పు కర్పూరం ఒకే పోలిక కలిగి ఉంటాయి కానీ చూడ చూడ అంటే బాగా పరిశీలించడం నిశితంగా చూడడం ప్రత్యేకించి చూడడం అని అర్థం  రుచి అంటే కాంతి అని అర్థం. కాంతి కిరణం పరావర్తన తీరు అని వస్తుంది  అంటే ఒకే పోలిక కలిగిన ఉప్పు మీద కర్పూరం మీద ఒక సూర్యకిరణం పడినప్పుడు ఉప్పు మీద సూర్య కిరణం 45 డిగ్రీల కోణంలోనూ  కర్పూరం మీద పడ్డ కిరణం 90 డిగ్రీల కోణంలోనూ పరావర్తన చెందుతుంది  దీనికి కారణం పదార్థ గుణంలో ఉన్న తేడాయే కానీ ఒకే రూపంలో ఉన్నందు వల్ల కాదు  ఈ తేడా తెలుసుకోగలిగిన  తెలివైనవాడు  జ్ఞాని  అలాగే పురుషులు అంటే స్త్రీ పురుషుడు ఇద్దరూ అంటే మానవులు అందరూ పుట్టుకతో సమానులే కానీ పుర్రె కో బుద్ధి జిహ్వ కొక రుచి  ఉంటుంది దీనికి కారణం సృష్టి వైవిధ్య ఫలితమైంది కావడం  సామ్యము వైషమ్యము సృష్టి యొక్క కోణం అలాగే పురుషుల్లో పుణ్యాత్ములు ఎవరో  పరీక్షిస్తే తెలుస్తుంది వాటి గుర్తు ఏమిటో  నిరీక్షించే తెలుస్తోంది వాటి గుర్తు ఏమిటో  కర్పూరం ఉప్పు ఒకే పోలికలో ఉంటాయి సమీక్షిస్తే తెలుస్తోంది వాటి రుచులు  తేడా ఏమిటో  తెలుసుకొని మసలుకుంటే మనకు ఎవరితోనూ ఏ విభేదము రాదు ఏ బాధ ఉండదు  ఇదే వేమన చెప్పిన జీవనవేదం ఇదే వేమన హృదయ విపంచి మ్రోగించిన తొలి జీవన రాగం  నరుడా వినరా నా మాట సుఖ జీవన బాటలో ముందుకు నడవరా బేటా అంటాడు వేమన  అందుకే వేమన బాట బంగారు బాట వేమన పద్యం కడు హృద్యం తెలుగు కవితమ్మ తల్లికి పెట్టిన నైవేద్యం వేమన పద్యం మకుటం మానవతా విలువల శకటం  నిత్య నూతన కవితా కెరటం అర్థానికి అందని వేమన ఆటవెలది  తెలుగు భాషా భుజానికి ఎలాంటి అందమైన పద్యాలు పూజించే మంత్ర విద్య తెలిసిన ఆరాధ్యుడు వేమన.వేమన గురించి ప్రత్యేకంగా వ్రాయాలంటే ఎంత గ్రంథమైనా అవుతుంది అసలు వేమన ఎవరు శతకసాహిత్యాన్ని ఎందుకు చేపట్టాడు  ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో ప్రజల కోసం ఎందుకు రాయలన్న ఆలోచన వచ్చిందో  అనూహ్యం  అసలు వేమన రెడ్డి కూడా ఒకవేళ రెడ్డి అని అనుకుంటే ఏంటి ఎడ్డి కులము అనే శబ్దాన్ని ప్రయోగిస్తాడా  శృతి శుభ్రత లేని కులంలో నేను జన్మించాను నా కులాన్ని రెడ్డి కులం అనుకునే శబ్దాన్ని ప్రయోగిస్తాడా  ఇది ప్రతి వారికి వచ్చే అనుమానం మరి ఆయన అన్నారుగా ఏంటి మడ్డి కులం రెడ్డి కులం నాదని అన్న మాట తప్ప ఆ శబ్దం తప్ప  రెడ్డి అన్న శబ్దాన్ని తీసుకుంటే నెక్కంటి వర్గం సందేహాలతో అనుమానాలతో డోలాయమాలంగా ఉండేవాడు  ద్రవంలో వాయువు కలకలిసి ఉంటాయి. ఘనాన్ని ఘనంగా ద్రవాన్ని ద్రవంగా విడదీస్తే వాయువు దానంతటదే పైకి వెళ్ళిపోతుంది  దీని విభజన అంత తేలికైన ప్రక్రియ కాదు  ఆయన చెప్పిన ప్రతి మాట మనకు తెలుస్తుంది కానీ అర్థం కాదు అర్థం చేసుకోవడానికి మనం ఆయన అంత స్థితికి ఎదగలేదు ఇంకా  ఒకవేళ ఎదిగితే ఆ స్థాయిని అందుకోవచ్చు శంకరాచార్యుల వారు చెప్పిన పునరపి జననం పునరపి మరణం ఎలా పరిమితమైనదో  అలాగే వీరి రచనలు కూడా ఈ రెడ్డి శబ్దాన్ని నిర్దేశించడానికి ఆయన ఉదాహరించడం చక్కటి ఆట వెలది  అసలు ఆట వెలది శబ్దంలోనే వెలది ఆట ఉన్నది తానాడుతూ ఎదుటివారిని కూడా ఆడించే స్థితికి తీసుకెళ్ళడం  ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ మూగచింతపల్లె మొదటి ఇల్లు  రెడ్డి కులం అదేమని తెలుపుతూ  విశ్వదాభిరామ వినురవేమ.


కామెంట్‌లు