మనం మన స్వలాభాలకు, సౌకర్యాలకు బానిసలుగా మారిపోయి
ఆధునికతను ఒక సాకులా చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతున్నాం...
తరతరాలుగా పాతుకు పోయిన అజ్ఞానాన్ని అధిగమించి మనం
ప్రగతి వైపుగా పరుగులు పెట్టడం వాస్తవమే అయినప్పటికీ
ఈ ప్రయాణంలో విలువైన సంపదను ఎంతో కోల్పోయాం...
జీవన పరిణామంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి....
ప్రయత్నాల, ప్రయోగాల బాటలో నడకను సాగించి
ఎన్నో ఆటంకాలను చవిచూసి నేడు ఈ స్థితికి చేరుకోగలిగాం...
అనాగరికతలోనే మనిషి తన వివేకంతో అద్భుతాల సృష్టికి నాంది పలికాడు...
మనుగడలో కలిగిన ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదురుకుంటూ,
కష్టనష్టాలకు తగినంతలో పరిష్కార మార్గాలను కనుగొన్నాడు...
ప్రకృతితో సత్ సంబంధాలను
కొనసాగిస్తూ, వనాల తోటలలో
ఆహారాన్ని అన్వేషిస్తూ
వనమూలికలతో వైద్య విద్యను ఆ నాడే అభ్యసించాడు మానవుడు...
పాడి పశు సంపదను పోషణకు ఆధారంగా మలచుకొని ఆదర్శ జీవనాన్ని గడిపాడు...
కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా నగర సంస్కృతి పై మోజు
పెరిగి విజ్ఞానవంతుల్లో కూడా అవివేకం మర్రి చెట్టు ఊడల్లా విశ్వమంతా
విస్తృతంగా విస్తరించి పాతాళానికి పాతుకుపోయింది...
నాగరికత పేరుతో సోమరిపోతుల్లా మారిపోయాం...
టెక్నాలజీ అంటూ ఫోన్ లను
చేత బట్టి పుస్తకాల వనరులకు, గ్రంధాలయాలకు
పూర్తిగా దూరమైపోయాం...
ఇలా ఒకటా రెండా...
ఒక్క మాటలో చెప్పాలంటే మనదంతా "వెల్ మోడ్రనైజిడ్ డిగ్నిఫైడ్ లైవ్స్"
(well modernised dignified lives)
అందుకే ఒంటికి ఏ చిన్న గాయమైనా, జబ్బు చేసినా ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే...
ఇంట్లో ఉన్న క్రిమి సంహారకమైన పసుపు, దగ్గును దూరం చేసే మిరియాల కషాయం,
విరోచనాలకు విరుగుడు మెంతులు, పంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపే లవంగాలు,
నిమ్మకాయ, అల్లం, శొంఠి, రోగ నిరోధక శక్తిని పెంచే తేనె,
ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో బామ్మల నాటి చిట్కాలు
మన వంటింటి వైద్యశాలలోనే ఉన్నా మనకు పట్టవు...
మూలికలు, దివ్యఔషధాలు, పెరడులో పెరుగుతున్న పసరు ఆకులు మనకు
చేతికి అందుబాటులో ఉన్నా వీటిని ఉపయోగించడం మానేసి సూది మందుల కోసం
సొమ్ములను పోగు చేసుకొని అర్ధ రాత్రులు ఆసుపత్రుల తలుపులను తడుతున్నాం...
ఇది మన అవివేకమా????
అజ్ఞానమా????
ఒక్కసారి మనను మనమే ప్రశ్నించుకుందామా....?
ఖర్చులేని వైద్యాన్ని తరాల
వైద్యసంపదను సంప్రదాయంలా కాపాడుకుంటూ ఇంగ్లీషు మందుల వాడకాన్ని
ఇకనైనా మితపరచుకుందామా....?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి