సహధర్మచారిణి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సామాన్యంగా చాలా కుటుంబాలలో భర్త ఉద్యోగం చేస్తూ  కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన ధనాన్ని సంపాదిస్తూ ఉంటే  దానిని ఎంతో పొదుపుగా వాడుకుంటూ ఇంట్లో గృహిణి  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు ఆ గృహానికి కావలసిన ప్రతి అవసరానికి ఆ డబ్బులు  చాలా పొదుపుగా వాడుతూ ఉంటుంది  పురుషుడికి ఒక రకమైన అహంకారం  నేను సంపాదిస్తున్నాను ఆమె తిని కూర్చుంటుంది అని  నిజానికి ఎవరిది ఎక్కువ సంపాదన అని ఒక్కసారి మనం లెక్క వేస్తే  ఎవరైనా ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నప్పుడు  గంట రెండు గంటలు చేసి నాలుగు వేల నుంచి 6000 వరకు డబ్బులు తీసుకుంటుంది  అలాంటిది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు తెగ చాకిరి చేస్తూ ఉంటే ఆమెకు ఎంత ఇవ్వాలి  దానిని లెక్కించగలవా.పిల్లలను ప్రైవేటుకు పంపిస్తే  ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల మగ పిల్లవాడు ఉంటే  వాళ్ళిద్దరికీ ట్యూషన్ ఫీజు ఎంతవుతుంది  గృహిణి వారు లేచినప్పటి నుంచి వారి అవసరాలన్నీ తీరుస్తూ  చదివే సమయం వచ్చేటప్పటికి ప్రక్కనే కూర్చుని అన్ని విషయాలు బోధిస్తూ చక్కగా వారిని తీర్చిదిద్దుతున్న  ఉపాధ్యాయినికి  ఎన్ని డబ్బులు ఇవ్వగలరు  నీవు ప్రొద్దుట లేవగానే నీకు కావలసిన అవసరాలను అన్నిటినీ తీర్చడానికి  నువ్వు మొహం కడుక్కోడానికి వెళితే బ్రష్ టూత్ పేస్ట్ ఇవ్వడం దగ్గర నుంచి స్నానానికి వెళ్లితే టవల్ ఇవ్వటం దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేస్తుంది కదా  ఆ చాకిరికి ఎన్ని డబ్బులు ఇస్తావు  వంట చేయడానికి ఎన్ని గంటల సమయం పడుతుంది  ఇంట్లో వంట మనిషిని పెట్టుకుంటే ఆమె పది వేలకు తక్కువగా తీసుకోదు కదా  ఈమె రెండు పూటలా వండి పెడుతూ హాయిగా చక్కగా నీకు కావలసిన పదార్థాలన్నీ  నచ్చినవి చేసిపెడుతోంది కదా ఆమెకు ఎన్ని డబ్బులు ఇస్తావు.
మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి  ఒక పని మనిషిని పెడితే ఆమె ఎంత తీసుకుంటుంది నీ భార్యకు ఎంత ఇస్తాం  సాయంత్రం పిల్లలు బడి నుంచి రాగానే వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ వారి ఆరోగ్యాలను కాపాడుతున్న వైద్యునిల ఇంట్లో ఉన్న ఆమెకు  ఎంత పైకం  ఇస్తావ్  వీటన్నిటినీ మించి రాత్రి  అందరూ పండుకున్న తర్వాత నీ దగ్గరకు వచ్చి నీ సుఖాన్ని తీర్చడానికి  ఉదయం నుంచి కష్టపడి ఎంతో నీరసంగా ఉన్నా మీకు సహకరిస్తున్న నీ సహధర్మచారినికి  ఎంత డబ్బులు ఇస్తే మీరు రుణాన్ని తీర్చుకోగలవు అన్నీ పూర్తిగా లెక్క వేస్తే నీవు సంపాదిస్తున్న జీతం ఎక్కువా ఆమెకు నువ్వు ఇవ్వవలసిన కూలీ డబ్బులు ఎక్కువా  ఒక్కసారి ఆలోచిస్తే నీ భేశజాలను ప్రక్కన పెట్టి ఆమెకు అనుక్షణం  ప్రతి పనిలో సహకరించడానికి సాయపడడానికి  మనసు పడతావు...కాదంటారా...?


కామెంట్‌లు