ఏ వ్యక్తి అయినా ఆనందమయ జీవితాన్ని గడపాలి అనుకుంటే తన నడవడికను క్రమబద్ధం చేసుకోవాలి అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కాలక్షేపం కోసం ఈ ఓ చదవడం ఏదో చదవడం ఊరికే మాటలతో కాలక్షేపం చేయడం ఏమాత్రం పనికిరాని విషయాలు ముందు నీ శరీరం ఆరోగ్యంగా ఉంటే నీకు అన్నీ శుభాలే జరుగుతాయి. దానిని నీ చేతిలోకి తెచ్చుకోవడం ఎలా? అది నీ చేతుల్లోనే ఉంది పెందలకడ నిద్రపోయి హాయిగా ప్రశాంతంగా తెల్లవారుజామున లేచి కాల కృత్యాలు తీర్చుకోవడానికి ఇంటిలో వంటగది ప్రక్కనే ఉన్న గదిలో కాకుండా దగ్గరలో ఉన్న నది గాని, చెరువు గాని దాని దగ్గర వరకు నడిచి వెళ్లి, నడిచి రావడం అక్కడ శారీరకంగా చమట పట్టేంతవరకు వ్యాయామం చేయడం ప్రథమకర్తవ్యం. బాగా చెమట పట్టిన తర్వాత కాసేపు సేద తీరి సూర్యోదయ సమయానికి ఆ నదిలో గాని చెరువులో గాని దిగి స్నానం చేస్తూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అదేదో మనం చేయకూడదు పాపం అనుకునే వారు చాలామంది ఉన్నారు అది ఒక రకమైన కులం వారు మాత్రమే చేస్తారు అన్న భ్రమ కూడా ఉంది కానీ దీని వల్ల ఏం జరుగుతుంది నీవు చేసే వ్యాయామం శరీరంలో ప్రతి అవయవాన్ని సమన్వయపరుస్తుంది కంటికి మాత్రం ఎలాంటి వ్యాయామం లేదు దానినిపూరించటానికి సూర్యునికి ఎదురుగా దోసిలిలో నీరు తీసుకొని 45 డిగ్రీల కోణంలో సూర్యకిరణానికి ఎదురుగా నిలబడినప్పుడు ఆ సూర్యకిరణం ఈ నీటిపై పడి అది కంటి వరకు వెళ్లి కంటికి చక్కటి వ్యాయామాన్ని కలగజేస్తుంది ఇది శాస్త్రీయం అలాంటివారికి చూపు పోవడం అరుదు. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తరువాత శరీరం చెప్పు చేతల్లో ఉండి నీవు ఎలా చేయాలనుకుంటే అలా చేయడానికి మార్గం సులభం అవుతుంది ఇంట్లో ఎవరు ఏది మాట్లాడినా దానికి అనుకూలంగా మాట్లాడే పద్ధతి అలవాటవుతుంది చిరాకులు పడడం అనేది ఆ శరీరానికి ఉండదు ఆప్యాయతను పెంచడంలోనూ మమకారాలను పంచడంలోనూ ఆ శరీరం సహకరిస్తుంది తప్ప ఎవరు ఎలాంటి కాని మాటలు అన్న వాటిని పట్టించుకునే స్థితిలో ఆశరీరం ఉండదు దీనివల్ల సంతాన ఉత్పత్తి కూడా ఆరోగ్యప్రదమైన బిడ్డలను ఈ సమాజానికి అందించడానికి దోహదపడుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు సనాతన ధర్మంలో ఇవన్నీ చేశారు కనుక వారు హాయిగా ప్రశాంతంగా జీవితమంతా నవ్వుతూ గడపడాన్ని మనం చూస్తున్నాం మరి మనం అలా ఎందుకు చేయకూడదు అని ఆలోచించి చేయడానికి ఉపక్రమించండి ఇది బాల్యంలోనే అలవాటు అయితే మరీ ఆనందం.
నడవడిక;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి