ఆరోగ్యం (మణిపూసలు):-పి. చైతన్యభారతి--హైదరాబాద్, 7013264464
ఆరోగ్యమె సిరిసంపద
వ్యాయామానికి పదపద
దురలవాట్ల కగ్గిపెడితె
ప్రశాంతంగ ఉంచును కద!

క్రమశిక్షణ కంచె వేసి
జిహ్వరుచిని అదుపుచేసి
రోగాలకు స్వస్థి పలుకు
శుభ్రతపై కన్నువేసి

పేదరికం పెనుసవాలు
అవిద్యతో చెడుదారులు
అవగాహన లేమితో
దీర్ఘకాలిక రోగాలు

లింగవివక్షే పెరిగెను
మహిళాలోకం నలిగెను
పోషకాహారం లేక
బిడ్డ వ్యాధి పాలాయెను

ధరలన్నీ పెరిగిపోయి
ఉపాధియే తగ్గిపోయి
దీనస్థితిలొ సమాజం
తిండికేమొ తిప్పలయి

వ్యాధులతో సునామీలు
కుటుంబాలు రోడ్డుపాలు
సంపూర్ణ అవగాహనె
అసలు సిసలు ఓషధాలు

కామెంట్‌లు