నానీలు(గంగానది):-చైతన్య భారతి, 7013264464
1. వర్తమాన
 ప్రవాహమేనా గంగ?
చిరస్మరణీయ 
గతానికి ప్రతీక. 

2. మాతృమూర్తి 
సమము గంగమ్మ. 
పెద్దమ్మై గుండెలో 
పారుతుంది మరి. 

3.బతికుండగా 
గంగలో మునగకున్నా.. !
ఆస్తికలై 
శాశ్వత జలకాలే. 

4.గంగమ్మను 
దర్శించలేని పేదలకు 
కన్నీటిలో చేరి 
నిత్యం తడుపుతోంది. 

5. నవ్వుల రారాజువైతే 
గంగ చెక్కిళ్ళను 
తడమదా ?
ఆనందబాష్పలై.

కామెంట్‌లు