రెడ్డి రాజులు (8);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒక పర్యాయం త్రిమూర్తులు ఆమెను పరీక్షించడం కోసం  వారింటికి భోజనానికి వచ్చి  భోజనానికి ముందు ఆమెను  వివస్త్రగా వచ్చి  వడ్డించమని అడుగుతారు  ఆమె మహా పతివ్రత గనుక  ఆ ముగ్గురిని చంటి పిల్లలను చేసి కన్నతల్లి పిల్లలకు ఎలా భోజనం పెడుతుందో అలా పెట్టింది  బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఒకటిగా చేసి మీరు ముగ్గురు వేరు కాదు ముగ్గురు ఒకటే  అని చెప్పడం కోసం ఆ కార్యం.
అనసూయ సృష్టించిన ఆ భగవంతుని పేరు దత్తాత్రేయ స్వామి. అరుంధతి పేరు తెలియని వారు ఉండరు ప్రపంచంలో  నూతన వధూవరులకు మొదట చూయించేది పురోహితుడు  ఆ అరుంధతీ దేవి నక్షత్రాన్ని  అరుంధతి జన్మతః మాదిగ కులస్తురాలు ఆమె భర్త వశిష్ట మహర్షి  రామాయణం రాసిన రోజులలోనే  వర్ణాంతర  మతాంతర వివాహాలు చేసిన ఘనత ఆ వాల్మీకి మహర్షిది.
అహల్య హల్యము కానిది  సాగు చేయని బీడును  అలా అంటారు. ఆమె చక్రవర్తి కుమార్తె  త్రిలోక సౌందర్యం ఆమె సొంతం  తన రాజ్యంలో వర్షాలు లేక  పొలాలన్నీ బీడులుగా మారిపోయిన  సందర్భంగా  గౌతమ మహర్షిని ఆహ్వానించి వారి ద్వారా విషయాన్ని తెలుసుకొని  అప్పటికప్పుడు గౌతమ మహర్షిని వివాహం చేసుకొని  వారితో యజ్ఞాన్ని  చేయిస్తుంది  విపరీతమైన వర్షాలు కురిసి  ఆ బంజరు భూములు అన్ని చక్కని పంటలను అందించాయి ఆ పంటను పోత పోసి శ్రీరామచంద్రుని ఆహ్వానించి  వారికి తన  దేశ ప్రగతి గురించి తెలియజేస్తుంది.  తన జీవితాన్ని  ప్రజల సుఖం కోసం, క్షేమం కోసం, సంక్షేమం కోసం త్యాగం చేసినది కనుక  శ్రీరామచంద్రమూర్తి తన శిష్యురాలిగా స్వీకరించారు.
లక్ష్మణుని భార్య ఊర్మిళ   మహారాజు  జేష్ట పుత్రిక  ఆమె వివాహ సందర్భంగా ఆమె తల్లి తనకు చెప్పిన విషయం  భర్త నీకు ఏ స్థానాన్ని ఇస్తే ఆ స్థానమే నీది. ఆ స్థానము తప్ప మరొకటి వద్దు అన్న విషయం ఆమెకు తెలుసు  అన్నతో పాటు లక్ష్మణస్వామి అడవులకు బయలుదేరి వెళ్లిన  14 సంవత్సరాలు  ఈ ఊర్మిళాదేవి  నిద్రతో కాలక్షేపం చేస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ తన భర్త తనకు ఏ స్థానాన్ని ఇచ్చాడో అదే గదిలో తపస్సులో ఉండి  భర్త వచ్చిన తరువాత గాని  ఈ లోకంలోకి రాలేదు. అలాంటి ఊర్మిళ మీద ఈ ప్రపంచానికి  ఆదర్శప్రాయం  రాక్షస కుటుంబంలో  రావణాసురునికి కుంభకర్ణుడికి  జన్మనిచ్చిన తల్లి  కైకశి  రావణుడు ఉదయం లేవగానే తల్లి పాద పూజ చేసి గాని తన పనులను  ప్రారంభించడు  పిల్లలను అలా పెంచిన తల్లి  కైకసి.


కామెంట్‌లు