దిక్సూచి;-డి.కె.చదువులబాబుప్రొద్దుటూరుకడపజిల్లా9440703716

 దారీ తెన్ను తెలియని అంటార్కిటికాలోనూ లేదా మహాసముద్రాల్లోనూ ప్రయాణం చేసేటప్పుడు ఎటు చూసినా మంచు మయం లేదా ఎటు చూసినా జలమయం. ఏ దిక్కు ఎటుందో తెలుసుకోలేని స్థితి. అలాంటి పరిస్థితుల్లో దిక్కు సూచించే పెద్దదిక్కు దిక్సూచి. దిక్సూచి ఇంజనీర్ల దగ్గర ఉంటుంది. మామూలు పాకెట్ దిక్సూచి మన దగ్గర కూడా ఉంటుంది. ఇవి కాక నావికుల దగ్గర ఒక దిక్సూచి ఉంటుంది. దానిని ఓడల దిక్సూచి అంటారు. ఓడలదిక్సూచి యంత్రాలు మేగ్నెటిక్ దిక్సూచి యంత్రాలు. మేగ్నెటిక్ దిక్సూచి యంత్రంలో ఒక మేగ్నెటిక్ సూది ఉంటుంది. అయస్కాంతీకరించబడిన సూదన్నమాట. సూది అంటే గడియారంలో ఉండే ముల్లులా ఉంటుంది. ఇది సులభంగా అటూ ఇటూ తిరగగలుగుతుంది. ఈ దిక్సూచిని కదలకుండా ఒకచోట పెడితే దానిలోని ముళ్ళు ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ నిలబడుతుంది. ఈ ముళ్ళు రెండు వైపులా ఒకే రకంగా ఉండదు. ఒకవైపు ఎర్ర రంగు కానీ మరేదైనా రంగు వేస్తారు. మరొకవైపు మామూలుగా ఉంటుంది. దీన్ని బట్టి మనము సులభంగా దిక్కులు తెలుసుకోవచ్చు. ఎటువైపు ఉత్తర ధ్రువమో,ఎటువైపు దక్షిణ ధృవమో గుర్తించవచ్చు.ఇలాంటి అయస్కాంత దిక్సూచి యంత్రాలను నావికులు ఎక్కువ ఉపయోగిస్తారు. వారికి దిక్సూచి చాలా అవసరం. ఎందువలనంటే వారు ఏ దిక్కులో ప్రయాణం చేస్తున్నారో దీన్ని బట్టి సులభంగా వాళ్ళు తెలుసుకొని ఓడను సరైన మార్గంలో నడిపిస్తారు.

కామెంట్‌లు