నా ఇల్లే ఒక నందన వనం( కవిత);- భోజన్నగారి చంద్రశేఖర శర్మ --9441631545
 నా ఇల్లే ఒక నందన వనం 
నా ఇల్లే ఒక సుందర సదనం/
అందులో /
అమ్మానాన్నలతో నా జీవనం / 
నాకది ఒక సుందరకావ్యం/ 
భార్యా పిల్లలతో గడుపుతున్న సమయం / 
కొత్త ఉత్సాహాన్ని నింపే
అమృత భాండం /      
  అక్కాచెల్లెళ్లతో ,అన్నదమ్ములతో
ఆడిపాడే ఆ క్షణం /   
మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఔషధం/ 

పండగలొస్తే అందరం కలిసి ఉండే దినం/
మానసిక రుగ్మతలన్నీ అవుతాయి
దూరం /
అందుకే 
నా ఇల్లే ఒక నందనవనం/           
 నా వాళ్ళతో నేను గడిపే క్షణాలన్నీ/ విరబూస్తాయి అందమైన పుష్పాలుగా /
నిలుస్తాయి అందమైన అనుభవాలుగా /
అన్నది నిజం /
బ్రతికే ఈ నాలుగు రోజులు/ గడుపుదాం ఆనందంగా /
నిలుద్దాం అందరికీ ఆదర్శంగా/....

       
కామెంట్‌లు