మేం శ్రమించే శ్రామికుల పిల్లలం
మా ఆశ్రయం లేని తెల్ల మల్లెలం
శ్రమయే జయతే అని నమ్మినవారలం
శ్రమ విజేతలమై దుమ్ము రేపు పోరలం !
మేం నిత్యం శ్రమించే శ్రామికులం
మా బత్యం ఆశించు శ్రమ ప్రేమికులం
దేహి అని ఎవరిని అడిగేవారము కాము
పాహిమాం అని పనిచేయకుండా ఊరుకోం !
మా శ్రమనే నమ్ముకున్న వారాలం
మా ఆశ్రయాన్ని నిర్మించుకున్న పోరలం
మేం శ్రమ జీవన పోరాట గీతం పాడుతాం
మా చెమట చుక్కను చిందించి శ్రమ పడుతాం!
శ్రమించి వృద్ధి అభివృద్ధిని సాధిస్తాం
శ్రమను మించిన దేదీ లేదని వాదిస్తాం
ఆశించిన దానిని అవలీలగా అందుకుంటాం
పోషించి మా బ్రతుకును ముద్దుగా దిద్దుకుంటాం!
శ్రమించి ఆకలిని తీర్చుకుంటాం
పరిశ్రమించి స్థితిగతుల మార్చుకుంటాం
కావలసిన వాటిని సమకూర్చుకుంటాం
మా శ్రమ పరిశ్రమ సామ్రాజ్యాన్ని ఏలుకుంటాం!
శ్రమ పరిశ్రమ ఆరోగ్యాన్ని ఇస్తుంది
సక్రమ నడకకు పునాదిని వేస్తుంది
ఆ దారిలో నడుస్తూ సాగుతాం ముందుకు
రహదారుని మారుస్తూ ఎగుతాం మా విందుకు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి