కృష్ణారెడ్డి ప్రయత్నం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రపంచ దేశాలలో  అనేక గ్రంథాలు  మన చేతికి రాకుండా పోయినాయి  ఎంతోమంది కవుల చక్కటి కవిత వస్తుంది  చాలామంది రచయితలు  కథలు నవలలు  కథానికలు నాటకాలు  రాసినవి చాలా కాలగర్భంలో కలిసి పోయినాయి. ఆ రోజులలో ముద్రణాలయాలు లేకపోవడం  తాళపత్ర గ్రంథాలు శిథిలం అయిపోవడం  వల్ల ఇలా జరిగింది. చాలామంది  చరిత్రను గురించి చెప్పినవి పోయినాయి. అలాగే వేమన వ్రాసిన  కొన్ని వేల ఆటవెలదులను ఆశువుగా చెప్పినది  ముద్రణకు నోచుకోక  మన చేతి వరకు రాలేదు  కొంతమంది పల్లెలలోకి వెళ్లి  అనూచానంగా వారి  తాతలు ముత్తాతలు చెప్పిన పద్యాలను చేసిన వారిని  కలిసి వారు చెప్పిన పద్యాలను  గ్రంథస్తం చేసిన వాళ్లు కొంతమంది ఉన్నారు.
అలాంటి  వారిలో చరిత్రకు చేరని కడప తెలుగు వెలుగు  అయోధ్యా పురం కృష్ణారెడ్డి గారు ఒకరు. తెలుగునాట ఆధునిక వికాసం పాఠశాల ద్వారా జరిగింది. ఒకటి ఆంగ్లం రెండవది ఉర్దూ. రాయలసీమ మిగతా మద్రాస్ రాష్ట్ర తెలుగు ప్రాంతాలలో ఆంగ్లం తెలుగు  ఉరుదు  కోస్తా రాయలసీమ మిగతా మద్రాసు రాష్ట్ర తెలుగు ప్రాంతాలలో ఆంగ్లం తెలుగు ద్వారా జరిగితే  తెలంగాణలో ఉర్దూ ఆంగ్లం ద్వారా జరిగింది. అలనాటి మద్రాస్ రాష్ట్రంలో సీపీ బ్రౌన్ లాంటి ఔత్సాహిక పరిశోధకులు పూనుకోవడం వల్ల  ఆంధ్ర భాష వల్ల తెలుగు పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. అలనాటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలలో ప్రింటింగ్ ప్రెస్, మిషనరీల వల్ల రెండు వికాస కేంద్రాలు ఏర్పడ్డాయి
ఒకటి షైన్ ఛార్జ్ ఫోటో  రెండవది కడపలో ఏర్పడిన బ్రౌన్ కాలేజ్  ఈ రెండు కేంద్రాలు  పూర్తిగా భిన్నమైనది.  బ్రౌన్ కాలేజ్ కాలేజ పేరుతో అయోధ్యా పురం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో  తెలుగు భాషా సాహిత్య అధ్యయన కేంద్రం ఏర్పడింది ఈ కేంద్రం  ద్వారానే వందలాది తెలుగు ప్రాచీన గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. చరిత్ర సంస్కృతి జ్ఞానం అంటే అంశాల ప్రాముఖ్యత అవగాహన కలిగిన వాడైనందువల్ల  సిపి బ్రౌన్ అయోధ్యా పురం కృష్ణారెడ్డి సహకారంతో వాటిని సేకరించి  పదిల పరచడానికి పూనుకున్నాడు. అప్పటికే సిపి బ్రౌన్ కు ఫార్సీ బాగా వచ్చు తెలుగు అంతంత మాత్రమే వచ్చు  ప్రాచీన గ్రంథాల రాతప్రతుల సేకరణకు ఎక్కడ లభిస్తాయి, ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకోవడానికి  కృష్ణారెడ్డి ప్రయత్నిస్తూనే అధికారిగా తన పలుకుబడిని ఉపయోగించేవాడు బ్రౌన్.


కామెంట్‌లు