తత్త్వం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ మానవ శరీరం ఏమిటో ఎందుకు ఈ భూమి మీదకు వచ్చిందో చాలామందికి అర్థం కాని విషయం. నిజానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వారు కూడా చాలా తక్కువ  ఎవరో ఋషులు మునులు లాంటివారు  దీని ప్రారంభం ఎక్కడ ఉండి ఇది ఎలా పెరుగుతుంది దీని ముగింపు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని గురించి ఈ మానవ శరీరం దేనితో నడుస్తోంది ఏ శక్తి అతనిని ముందుకు నడిపిస్తోంది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం  జీవికి తనువుకు  ఉన్న భేదాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎంతో శ్రమకు ఓర్చి వారికి తెలియని విషయాలను తెలిసిన వారి దగ్గర విషయాలను  తెలుసుకొని దాని మీద పరిశోధన గావించిన  కొంతకాలానికి వారికి అర్థమవుతుంది.
ఈ శరీరానికి ఏ విధమైన వ్యక్తిత్వం లేదు  ఆ శరీరం లోపల ఉన్న జీవి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది  ఈ శరీరం అంటే  9 రంధ్రాలతో కూడిన  అస్తిపంజరం లాంటిది  ఎప్పుడు ఆత్మ ఈ తనువు లోపల ఉన్నదో అంతవరకు ఇది సజీవంగా ఉంటుంది  ఎప్పుడు ఆత్మ తన దారి తాను చూసుకుంటుందో ఈ శరీరం ఎందుకూ పనికిరాకుండా పోతుంది. ఆత్మ లేని తనువుని అతి దగ్గర సన్నిహితులు భార్యా పిల్లలు కూడా  ఇంటిలో ఉంచడానికి అంగీకరించరు. ఆ శరీరం ద్వారా ఎన్నో సుఖాలను పొందిన పాఠాలను నేర్పి తన జీవితాన్ని నిలబెట్టింది ఆ తనువే అన్న విషయాన్ని తెలిసిన బిడ్డలు కానీ  అతని కలేబరాన్ని చూసిన తర్వాత  ఎందుకూ పనికిరాక ఒకటి రెండు రోజుల తరువాత దుర్గంధాన్ని వెదజల్లే ఆకలేపరాన్ని ఇంట్లో ఉంచడానికి ఎవరూ అంగీకరించరు.
ఏ క్షణాన ఈ తనువు ఏమి అవుతుందో  తెలియని మనిషి  తన అలంకారాలకు  ఆభరణాలను  ధరించడానికి ఖరీదైన బట్టల్ని  మిగిలిన అనేక  పద్ధతులలో ఈ శరీరానికి వాసనలు వచ్చేటట్లుగా సుగంధాలు  పూయడం లాంటి  అనవసరము అన్న విషయం తెలియదు. ఈ  తెలియని తనువు మీద ఉన్న ధ్యాసను  శరీరంలో ఏ ఆత్మ దీనిని కదిలిస్తుందో దాని గురించి ఆలోచిస్తూ  దానిని తెలుసుకున్నట్లయితే జీవితం సఫలం అవుతుంది  అంతేకానీ కులాల పేరుతో మతాల పేరుతో  ఈ శరీరానికి ఎన్నో చేస్తూ  కాలాన్ని వృధా చేయడం  తగని పని అని వేమన మనకు  హితబోధ చేస్తూ  చక్కటి ఆటవెలది పద్యాన్ని  మనకు అందించారు  ఆ పద్యాన్ని ఒక్కసారి మీరు కూడా చదివితే అసలు విషయం మీకు కూడా అర్థమవుతుంది చదవండి మరి.


"తొమ్మిది కంతల తిత్తికి నిమ్మగు సొమ్ములను కులము నేటికి జెప్పుమా  
నమ్మకు దేహము నాదని బమ్మను నెననుచు దెలసి బలుకరవేమ..."



కామెంట్‌లు