యోగి లక్షణం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 శంకరాచార్యుల వారు చెప్పినా మరొక ప్రవక్త చెప్పిన ఉన్న విషయం  కంటికి కనిపించే ఈ ప్రపంచమంతా శూన్యం ఏమీ లేదు మానవుడు ఏదైనా పని చేయడానికి ప్రారంభించినప్పుడు అనేక అడ్డంకులు రావడం  ప్రతి ఒక్కరికి అనుభవంలో వచ్చే ఉంటుంది  దీనికి కారణాన్ని అన్వేషించినట్లయితే  ఏ కార్యాన్ని మనం చేపట్టేమో దాని మూలాన్ని తెలుసుకొని దానిని ఎలా సాధ్యంచాలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని అప్పుడు ప్రారంభిస్తే అది విజయం  పొందుతుంది తప్ప విషయ పరిజ్ఞానం తెలియకుండా  ఆ పని చేయడానికి ప్రారంభిస్తే అది ఆరంభంలోనే  అర్థం కావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది దానికి ముఖ్య కారణం ఏమిటి అని మనం లోతుగా ఆలోచించినట్లయితే  అసలు విషయం మనకు బోధపడుతుంది. అరిషడ్వర్గాలు ప్రతి మానవుని లోను  అంతర్గతంగా ఉంటాయి  ఒకటి గనక ఈ శరీరంలో ప్రవేశించినట్లయితే  మిగిలిన 5 ఒక దాని తరువాత ఒకటి వచ్చి అతనిని అదహ పాతాళానికి తీసుకొని పోతుంది  జీవితంలో మళ్లీ తట్టుకోలేని  ప్రమాదానికి గురవుతాడు  మొదటిది కామం ఆ కోరిక ఎప్పుడైతే ఈ మనసులో ప్రవేశించిందో దానికి మర్రి చెట్టు ఊడల్లా  ఒక్కొక్కటి ఒక్కొకటి పెట్టుకుంటూ వెళ్లి  క్రోధానికి  వసుడైపోతాడు  దాని తర్వాత అనుకోకుండా మోహం ఆవరిస్తుంది దానితో  అతనికి మంచి చెడు తెలిసే అవకాశం లేకుండా పోతుంది  దాని తర్వాత లోభం గనుక తనకు పట్టిందంటే  దాని సహజత  మాత్సరం వచ్చి తీరుతుంది  ఈ ఆరు వచ్చినట్లయితే జీవితంలో ఎందుకు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ ఆరు గుణాలను శత్రువులుగా భావించి ఈ ఆరుగురిని చంపితే తప్ప నీవు జీవితంలో అనుకొన్న కార్యక్రమాన్ని ప్రారంభించలేవు అని ఉద్బోధిస్తున్నాడు వేమన  అప్పుడు మనసును ఏకీకృతం చేసి  ముందు ఈశ్వరుని తలచుకొని  నేను నిమిత్తమాత్రుణ్ణి నేను ఈ కార్యక్రమాన్ని చేయాలి దానికి మీ సహకారం కావాలి దీనిలో నేను విజయాన్ని సాధించేందుకు తోడ్పడు  అని ప్రార్థించి మొదలు పెట్టినట్టయితే ఆ కార్యక్రమం తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు  అప్పుడు పొగడమేదో నెడుకోడమేదో తనకు తెలుస్తుంది అవి రెండుగా కనిపించిబా ఒకటే అన్న విషయం సాధన మీద తెలుస్తుంది  ఆ తెలుసుకొని జీవితంలో నిలబడిన వాడే యోగిగా చెప్పబడతాడు  అని వేమన ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఆ పద్యాన్ని ఒకసారి చదవండి.


"ఆరుగురుని చంపి హరుమీది ధ్యానంబు నిలిపి నిశ్చయముగా నెగడి యాత్మనతని యొకని సేయునాతడే యోగిరా..."


;

కామెంట్‌లు