🪷 శ్రీ మాత! కనకదుర్గ!
విశ్వ వినోదిని! దుర్గ!
విష్ణు విలాసిని! దుర్గ!
రక్షమాo! విజయదుర్గ! (1)
🪷విజయమే రూపమమ్మ!
విశ్వమే నీ తేజమమ్మ
విజయ మొసగు మమ్మ!
రక్షమాo! విజయదుర్గ! (2)
( అష్టాక్షరి గీతి,, శంకర ప్రియ., )
🔆శ్రీమాతయే దుర్గాభవాని! భక్తుల దుర్గతులను పారద్రోలునది! కనుక, "దుర్గా"దేవి! విజయములను కలిగించు నది! కనుక, "విజయా"దేవి!
"విజయా విమలా వంద్యా" అని, శ్రీలలితా సహస్ర రహస్యనామ స్తోత్ర ము.. "346.వ" నామము నందు.. హయగ్రీవ గురుదేవులు ప్రస్తుతిoచారు!
🔆విజయదుర్గ.. ఈ చరాచర ప్రపంచమును సంరక్షణ కావించు చున్నది! దుర్మార్గబుద్ధి కలిగిన దుష్టులను శిక్షించు చున్నది! అట్లే, సన్మార్గబుద్ధి కలిగిన శిష్టులను రక్షించు చున్నది! రక్షాకరియే శ్రీమాత!
"రతిప్రియా రక్షాకరి" అని, శ్రీమాతను ప్రస్తుతిoచారు, హయగ్రీవాచార్యులు! శ్రీలలితాసహస్ర రహస్యనామ స్తోత్రము.. "317.వ. "నామము నందు కీర్తిoచారు!
🕉️శ్రీదుర్గ! జయ దుర్గ! జయజయ దుర్గ!
🚩ఆట వెలది పద్యము
అపజయమ్ము లందు నల్లాడు చున్నట్టి
మానవాళి కామె మహిత రక్ష!
ఆత్మశక్తి నొసగి యఖిలమ్ము గాచెడి
విజయ దుర్గ! నాకు విజయ మొసగు!!
పుట్టినట్టి మనిషి పుడమిపై జీవింప
అవసరమ్ము రక్ష యనుదినమ్ము
రక్ష సేయు దుర్గ, శిక్షించు దుష్టుల
విజయ దుర్గ! నాకు విజయ మొసగు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి