శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం కొండాపూర్ లో 28 సంవత్సరముల క్రితం విగ్రహ ప్రతిష్టాపన స్థాపన జరిగింది.
అప్పటినుంచి దినదిన ప్రవర్ధమానమై ప్రముఖ అలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో వసంతోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ సంధర్భంగా 26-4-23 నాడు శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది.
సాయంత్రం కుమారి శ్రావ్య, కుమారి అన్వితల భరత నాట్య ప్రదర్శన జరిగింది.
భరతనాట్య ప్రదర్శనలో భాగంగా. గోపిక శబ్దం, గురు శబ్దం, శంభొ శివ శంభొ అనే పాటకి నృత్యం చేశారు.
గురువు శ్రీ భాను రాజ్ గారి వద్ద నాట్యకళ ని గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా అభ్యసిస్తున్న వీరిద్దరూ శ్రీ సీతారాముల వారి సన్నిధిలో తమ నాట్యం తో అథ్బుతంగా గంటసేపు ప్రేక్షకులని అలరించారు.
బుధవారంతో వసంతోత్సవ వేడుకలు ముగిశాయి
జై శ్రీరాం. .




addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి