శుకుడు వ్యాసుని కుమారుడు. వేదవ్యాసునికి ఘృతాచి అనే అప్సరస కారణంగా శుకుడు జన్మించాడు. ఒకప్పుడు వ్యాసుడు పుత్రునికోసం శివునిగురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఆయన కోరిక ప్రకారం పంచభూతాలతో సమానమైన పుత్రుడు కలుగుతాడని వరం ఇచ్చాడు. వ్యాసుడు హోమం కోసం అరణిని మధిస్తుంటే ఘృతాచి అనే అప్సరస ఆయనకు కనపడింది. ఆయన కామవశుడైనాడు. ఆమెనే తలచుకుంటూ అరణి మధిస్తున్నపుడే వీర్యస్ఖలమై అరణిలో పడింది. వెంటనే దివ్య తేజస్సు కలిగిన కుమారుడు జన్మించాడు. శుకరూపంలో వున్నందున అతనిని శుకుడు అన్నారు. శుకము అంటే చిలుక అని అర్థం. 16 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఎంతో అందంగా అందరినీ ఆకర్షించే రూపం కలిగింది. ఆయనను చూసి మోహించని వారే లేరని ప్రతీతి. అయినా ఆయన ఎవరినీ లెక్క చేయక యోగివలె ఉండేవాడు. తండ్రి ఆజ్ఞతో భూప్రదక్షిణం చేయటానికి వెళ్లాడు. ఆవు పాలు పితకటానికి పట్టేంత సమయం మాత్రమే ఒకచోట ఉండేవాడు. ఆయనకు బాహ్యస్మృతి ఉండేది కాదు. దేహంమీద వస్త్రం గురించిన ధ్యాస ఉండేది కాదు. ఏ విషయంలోను లోలత్వం లేనివాడై తిరిగేవాడు. ఇంద్రియ నిగ్రహమే ఉత్తమమైన ధర్మమని తెలుసుకున్న శుకుడు యోగీశ్వరుడైనాడు.సర్వ భూతమయుడుగా, నిర్వికల్పుడుగా, సర్వాన్నిత్యజించి, ఒంటరిగా ముందుకువెళ్తున్న కుమారునిపై మమకారాన్ని వదలలేక వ్యాసుడు ‘ఓ కుమారా!’ అని పిలుస్తూ అనుసరిస్తుంటే, వృక్షాత్మకమై ప్రకృతి ఆయనకు ‘ఓ’ అంటూ బదులిచ్చింది తప్ప శుకుని నుండి మాత్రం సమాధానం రాలేదట. అంటే బంధ విముక్తుడై ప్రకృతిమయుడై, అంతటి తండ్రికే అంతుపట్టని ఆధ్యా త్మిక ఔన్నత్యాన్ని పొందిన ఘనుడు శుకుడు.
శుక మహర్షి; - సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి