స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 అన్ని అవయవాలు లక్షణంగా ఉన్న మనం ఎప్పుడూ ఏదో ఒకదానికి చింతిస్తు బెంబేలుపడతాం.దేవుళ్ళని తల్చుకుంటూ గడుపుతాం కానీ మనకన్నా దీన హీనఉన్న వారిని గూర్చి ఆలోచించం!కానీ బెంగుళూరు కిచెందిన28ఏళ్ల అలీనా ఆలం సమర్ధనం ట్రస్ట్ పేరుతో దివ్యాంగులకై  మిట్టికెఫె  నడుపుతున్నారు. మిట్టీ మట్టి అని పేరు పెట్టడంలో ఆమె ఉద్దేశం మనం మట్టి లోనే పుట్టి పెరిగి మట్టిలోనే కల్సిపోతాంకాబట్టి!2017లో బి.వి.బి.ఇంజినీరింగ్ కాలేజీలో నెలకొల్పిన దీనికి ఆమె బ్రాండ్ ఎంబాసిడర్!దివ్యాంగులు వారి హక్కులు వారు తెలుసుకోవాలి  వారి కో ప్లాట్ ఫాం అవసరం అనే ఈమె  అందరికీ  ఆదర్శం. సెలవుల్లో ఇలాంటి వారి గూర్చి తెలుసు కుంటూ మనం చలివేందరాలు పెట్టి మంచి నీరు అందించాలి🌹
కామెంట్‌లు