అందమే ఆనందం;- గుండ్లపల్లి రాజెంద్రప్రసాద్, భాగ్యనగరం
అందం
అగుపించితే
ఆనందం
అందుకుంటా

అందం
ఆహ్వానిస్తే
అంగీకరిస్తా
అక్కునచేరుతా

అందం
అభ్యర్ధిస్తే
ఆమోదిస్తా
అనుభవిస్తా

అందం
వస్తానంటే
రమ్మంటా
చేకొంటా

అందం
కావాలంటే
తోడుగా
నిలబడతా

అందం
అండకోరితే
ఆశ్రయమిస్తా
అభయహస్తమిస్తా

అందం
సరసాలాడితే
స్పందిస్తా
సంబరపడతా

అందం
నవ్వితే
మురిసిపోతా
ముచ్చటపడతా

అందం
చేయిచాపితే
చేతులుకలుపుతా
చెలిమిచేస్తా

అందం
ప్రభవించితే
వెలుగులుచిమ్ముతా
వేడుకచేస్తా

అందం
అడిగితే
అన్నీయిస్తా
ఆహ్లాదపరుస్తా

అందం
అలిగితే
బ్రతిమాలుతా
బుజ్జగించుతా

ఆహా!
అందం
నాదే
ఆనందం
నాదే

అదృష్టం
నాదే
అందలం
నాదే

అందం
ఒకదృశ్యం
ఆకట్టుకుంటుంది
ఆశ్చర్యపరుస్తుంది

అందం
ఉత్సాహం
ఉల్లాసపరుస్తుంది
ఉవ్విళ్ళూరిస్తుంది

అందం
అమృతం
అందుకోమంటుంది
ఆస్వాదించమంటుంది

అందం
ప్రకాశం
కళకళలాడుతుంది
కాంతులుచిమ్ముతుంది

అందం
అతివసమానం
అభిమానిస్తుంది
అలరించుతుంది

అందం
ప్రణయం
ప్రేమలోపడవేస్తుంది
పరవశపరుస్తుంది

అందం
ప్రోత్సాహం
కలంపట్టమంటుంది
కవితలువ్రాయమంటుంది

అందం
అనంతం
అమూల్యం
అక్షయం

అందం
అపరూపం
అద్భుతం
ఆనందం

అందం
నాకవితావస్తువు
ఆనందం
నాకవనలక్ష్యము

అందరిని
ఆకర్షిస్తా
అందరికి
ఆహ్లాదమిస్తా


కామెంట్‌లు