" కాకి ";- కొప్పరపు తాయారు

 మన దేవతలు దాదాపు అందరికీ సంగీత వాయిద్యాలు చేతిలో ఉంటాయి.దాని అర్థం గీతా 
గానాలకి ముఖ్య భూమిక ఉంది.
                 సరస్వతి మాత చదువుల తల్లి ఆమె చేతిలో వీణ, నారదుని చేతిలో తంబుర (మహతి)
కృష్ణుని చేతిలో వేణువు, పరమశివుని చేతిలో డమరుకం, అన్నిటికంటే ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు
చేతిలో శంఖం .శంఖం ఊదితే ఓం అనే నాదం.
                  నాదం పరబ్రహ్మ స్వరూపం.నాదం గానానికి,గళానికి, మాటకు బలం ,ప్రాణం.ఇందు నుండే సంగీతం ఆవిర్భవించింది.
              మొత్తానికి గానాన్ని దేవ దానవులు,సర్వులు ఇష్టపడతారు.ఆఖరికీ శిశువులు, పశువులు, పాములు,అంటే అన్ని ప్రాణులు గానానికి దాసాను దాసులే.
                      మనదేశం సితారు వాయిద్యం చాలాకాలం నుంచి ఉంది అని నానుడి.ప్రాచీన కాలం
నుంచి ఉపయాగిస్తున్నారని.
              కానీ పన్నెండవ శతాబ్దంలో మనదేశంలో
జీవించిన సుప్రసిద్ధ పర్షియన్ కవి అమీర్ ఖుస్రూ 
*సెహ తార్" అనే సంగీత వాయిద్యాన్ని రూపొందించాడనీ, అదే తరువాత వాడుకలో రూపాంతరం చెంది సితార్ గా మారిందని అంటారు.
ఏది ఏమైనా ఈ వాయిద్యానికి ఏడు తంత్రులు
ఉంటాయి.వినడానికి హాయిగా ఉంటుంది.వీణలాగే
వాయించాలి,కాకపోతే వీణకు రెండవ వేపు బరువు
ఉండడం వల్ల అడ్డం గా తొడ మీద పెట్టుకొని వాయిస్తారు. సితార్ నిలబెట్టి అనుకూలంగా మార్చు
కుని ఉపయోగిస్తారు.
                  శుభం
కామెంట్‌లు