; -
రావణవధానంతరం స్వర్ణ లంకను నుంచి బయలుదేరి వెళ్ళే తరుణం ఆసనమయ్యింది. అపుడు శ్రీ రాముడు లక్ష్మణుడితో అంటాడు:—-
"అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మ భూమి శ్చ స్వర్గాదపి గరీయసీ"
"ఈ లంక ఎంత వైభవోపేతమైనా లక్ష్మణా నాకేమీ నచ్చడం లేదు. తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటే గూడా గొప్పవి/ ఇక్కద ఎన్ని వైభవాలున్నప్పటికీ ఇది మన జన్మభూమి అయిన మన అయోధ్యతో సమానమవుతుందా?" అని.
చిన్నప్పటి స్నేహాలు, పెరిగిన వాతావరణం దానితో ఏర్పడి పోయే అనుబంధం ఎంతో గొప్పది. ఆప్యాయంగా పెంచిన పెద్దలు, నాటి చెట్టు చేమలు మనిషి మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. మనకు అక్కడ ఏ ఆస్తి లేకపోయినా ఆ ఉన్న( ప్రదేశం మనిషి అంతరాంతరాలను స్పృశిస్తూ భావోద్వేగాలను కలిగిస్తూ ఉంటుంది.అందుకే మన జన్మభూమి అంత గొప్పది.
శ్రీరాముడిది విశిష్ట వ్యక్తిత్వం. రావణ రాజ్యం గెలిచినా అక్కడి నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ముట్టుకోలేదు. రావణ రాజ్యంపై లక్ష్మణుడు ఆశ పడ్డా అతన్ని వద్దని వారించాడు. జననీ జన్మభూమిశ్చ. స్వర్గాదపి గరీయసీ అంటూ సొంత రాజ్యాన్ని గుర్తు చేశాడు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అని సూచించాడు. ఇది మనందరికీ శిరోధార్యం, సదా అనుసరణీయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి