శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 చక్రవర్తి అంటే రాజు సత్తా అధికారంని సూచించేది.పూర్వంసార్వభౌముడైన రాజు ని చక్రవర్తి అని సంభోదించేవారు.బౌద్ధ సాహిత్యంలో ధర్మం  నిజంనీతి న్యాయంతో పాలించేవాడు అని ఉంది. బెంగాల్  మహారాష్ట్ర లో చక్రవర్తి అనే పేరు పెట్టుకుంటారు.
చతుర్ముఖుడు అంటే నాల్గు ముఖాల బ్రహ్మ అని అర్ధం. త్రిమూర్తులలో మొదటివాడు సృష్టికర్త. కానీ ఈయనకి ఆలయం పూజలు లేవు.ప్రజాపతి పితామహ హిరణ్య గర్భుడు.విష్ణుమూర్తి నాభిలోంచి పుట్టాడు. స్వయంభూ అంటారు. కొన్ని పురాణాల ప్రకారం సావిత్రి భార్య  హంస వాహనం.
చిరంజీవి కి అర్ధం దీర్ఘాయుష్మంతుడు.కొడుకు ని ఆశీస్సులతో ఇలా అంటారు. మరాఠీ లో కొడుకు అని అర్థం. 🌺

కామెంట్‌లు