తలవంపుల బ్రతుకులొద్దు ;- కోరాడ నరసింహారావు

 కొందరి విజయ రహస్యం ఇదే కావచ్చు !
 ఉన్నతపదవులనూపొందవచ్చు !
  సన్మాన సత్కారాలు  లభించ     నూ వచ్చు !
   పలువురు చప్పట్లుకొట్టవచ్చు
    ఒక్కడు మాత్రం... ఛీ.... "నీబతుకు చెడ... నీకు సిగ్గు లేదూ....,, 
     ఉన్నోడి కాలి బూటును కుక్కలా నాకి ఇలా ఇన్నీ పొందే కన్నా....చేతగాకపోతే చావటం మిన్నరా.... అంటుంటే., ఆఁ అంతరాత్మ గాడి సవాల్ కు నీదగ్గర ధీటైన జవాబేదీ !?ఈ ఆనందమంతా ఆవిరైపోయి.... 
 ముఖం మాడిపోయిన అప్పడమైపోతుందోయ్... !
    నీ స్వశక్తితో చేతనైనంత సంపాదించి... ఆ ఆనందంతో గర్వo గా తలెత్తుకు తిరగవోయ్ ! 
  నీ ముఖం అప్పుడు  ప్రకాశమాన సూర్య బింబమో, ఆనంద చల్లదనాల చంద్రబింబమో అయి, మెరిసిపోయేలా... !!
      *******
కామెంట్‌లు