న్యాయాలు -106
దేహళీ దీప న్యాయము
******
దేహళీ అంటే ఇంటి గడప. దీపము అంటే ప్రకాశము వెలుగు అని అర్థం. దేహళీ దీపం అంటే ఇంటి గడప మీద పెట్టిన దీపము అని అర్థం.
గడప మీద పెట్టిన దీపము ఇంటిలోపల, బైటా రెండు వైపులా వెలుగు ఇస్తుంది.ఒకటే దీపం రెండు రకాలుగా ఉపయోగపడింది అనే అర్థంతో ఈ దేహళీ దీప న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే "ఏక క్రియా ద్వ్యర్థకరీ" అని కూడా అంటారు.అంటే చేసే ఒకే పని ద్వారా రెండు ఫలితాలను పొందడం అన్న మాట.
మనం ఏ మంచి పని చేసినా స్వంతం కోసమే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడినట్లయితే స్వపర లాభాలు సిద్ధిస్తాయి.
మనం చేసిన జ్ఞాన సముపార్జన మన లోలోపల జ్యోతిలా ప్రకాశిస్తూ ఉంటుంది.ఆ విజ్ఞాన జ్యోతిని అందరికీ పంచితే ఆ సముపార్జనకు సార్థకత చేకూరుతుంది.
దీనికి దగ్గరగా ఉన్న ఓ శ్లోకాన్ని చూద్దాం.
"ఏకోమునిః కుంభ కుశాగ్ర హస్త/ఆమ్రశ్చ మూవే సలిలం దదాతి/ ఆమ్రశ్చ సిక్తః పితరశ్చ తృప్త/ ఏక క్రియా ద్వ్యర్థ కరీ ప్రసిద్ధా!!"
'ఈ శ్లోకానికి భావము ఒక మునీశ్వరుడు చేతిలో నీటి పాత్రను మరొక చేతిలో నువ్వులు, దర్భలను తీసుకుని మామిడి చెట్టు మొదట్లో నీళ్ళతో వాటిని వదిలి పెట్టాడు.దాని వల్ల మామిడి చెట్టుకు నీళ్ళు లభించాయి.పితృ దేవతలకు తర్పణం జరిగింది.ఒక పని చేయడం వల్ల రెండు ప్రయోజనాలు లభించాయి."
తన పితృదేవతలకు తర్పణాలు వదులుతూనే ఓ పచ్చని చెట్టుకు నీళ్ళు పోసిన పుణ్యాన్ని దక్కించుకున్నాడా ముని.
మనం అప్పుడప్పుడు వివిధ ప్రదేశాలను చూడడానికి వెళ్తూ ఉంటాం. కొత్త ప్రదేశాలను చూసిన అనుభూతి ఒకవైపు అయితే మరో వైపు ఆయా ప్రదేశాల చారిత్రక నేపథ్యం, గొప్పతనాన్ని కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
అలాగే పొద్దున్నే లేచి చేసే నడక వ్యాయామము ద్వారా రెండు మూడు రకాల లాభాలు పొందవచ్చు. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటే మనసు శరీరాలకు రెండింటికీ ప్రశాంతత, ఆరోగ్యం చేకూరుతాయి.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దినచర్య లేదా డైరీ రాయడం. ఇది చిన్నప్పటి నుండే పిల్లలకు,పెద్దలం మనం అలవాటు చేసుకుంటే లేఖనా సామర్థ్యంతో పాటు చక్కని వక్తగా రూపొందే అవకాశం కలుగుతుంది.
ఇలా దేహళీ దీప న్యాయాన్ని మన నిత్య జీవితానికి అనేక విషయాలకు, సందర్భాలకు అన్వయించుకోవచ్చు కదా! మీరేమంటారు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి