మనసులోని మాటలన్ని
మధురగీతికలు కాగా
కనులలోని కలలన్నీ
కనువిందుగ కనిపించవా?
విరిసిన పూలకు వీవనలూపుతూ
ప్రతి పత్రం పరవశించగా
పచ్చని శోభతొ అలరారే
తరుశాఖా తోరణాలు
గగనవీధుల నింగిదీపం
నారింజరంగులు వెదజల్లగా
పెదవి పై మొలిచిన నవ్వు
మొహమంతా కాంతిని నింపినట్టు
రంగులతో నిండిన నింగి
భావాలకు పదాలను
మాటలకు రాగాలను
రాగాలకు అనుభూతినీ
అనుభూతులతో ఆనందాన్నీ
అందించే అందమైన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి